ప్రేక్షకులందరికీ 'ఎక్స్ట్రా జబర్దస్త్' బృందం వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పింది. ఆరోజు(సెప్టెంబరు 10) రాత్రి ప్రసారమయ్యే ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అన్నీ టీమ్‌ల సభ్యుల తెగ సందడి చేస్తూ కనిపించారు.
ముందుగా వినాయకుడిని పూజించిన 'ఎక్స్ట్రా జబర్దస్త్' టీమ్.. పలు పాటలకు డ్యాన్సులు వేశారు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేశ్, జిగేల్ జీవన్ తమ తమ స్కిట్లతో తెగ నవ్వించారు.
వినాయకుడికి పూజ చేసిన తర్వాత.. సుధీర్‌కు రష్మి తీర్థం అందజేసింది. ఈ క్రమంలో సుధీర్.. రష్మి కాళ్లు మొక్కినట్లు ప్రోమోలో కనిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ తర్వాత సుడిగాలి సుధీర్ స్కిట్లో(Sudigaali sudheer) సుధీర్, గెటప్ శీను కలిసి రికార్డింగ్ డ్యాన్సులు చేసి అలరించారు. కెవ్వు కార్తిక్ స్కిట్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ నరేశ్‌తో అలరించారు.
ఇవీ చదవండి: