సుడిగాలి సుధీర్ మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఇప్పటివరకు ఓ వస్తువును మరో వస్తువుగా మార్చి లేదా మాయం చేసిన అతడు.. ఈసారి ఏకంగా గెటప్ శీనుతోనే ప్రయోగం చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇదంతా జరిగింది.
'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్‌ను టీజ్ చేస్తూ వాళ్ల టీమ్ చేసిన మ్యాజిక్ స్కిట్ అలరిస్తోంది. ఇమ్మాన్యూయేల్-వర్ష.. కొత్తగా బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో భాగమయ్యారు. వాళ్లు చేసిన పెళ్లి స్కిట్ మెప్పిస్తోంది. అలానే ఈసారి లేడీస్ స్పెషల్ స్కిట్ ఆసక్తిని పెంచుతోంది.
చివరగా జడ్జి రోజా అడగడం వల్ల మరోసారి స్టేజీపై మ్యాజిక్ చేసేందుకు సుడిగాలి సుధీర్ సుధీర్ సిద్ధమయ్యాడు. గెటప్ శీను నిలబెట్టి, చుట్టూ పేపర్ చుట్టారు. ఆ తర్వాత పేపర్ చింపే టైమ్‌కు ప్రోమో పూర్తిచేశారు. దీంతో వేరే వ్యక్తి వచ్చారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అని వీక్షకుల్లో ఆత్రుత మొదలైంది. దీనికి సమాధానం తెలియాలంటే జులై 9న రాత్రి 9:30 గంటలకు పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాల్సిందే.
ఇది చదవండి: 'మా' రాజకీయాల్లోకి అనసూయ, సుడిగాలి సుధీర్