ETV Bharat / sitara

ఆ సీరియల్స్​ వల్ల దూరదర్శన్​కు టాప్ రేటింగ్

దేశంలో లాక్​డౌన్ రెండోవారంలో అత్యధిక మంది వీక్షించిన ఛానల్ దూరదర్శన్ అని బార్క్ ప్రకటించింది. దూరదర్శన్ లో అలనాటి క్లాసిక్ సీరియళ్లు రామాయణం, మహాభారతం, శక్తిమాన్ ప్రసారాలే ఇందుకు కారణమని తెలిపింది. పాత సీరియళ్లను ప్రసారం చేస్తోన్న ఇతర ఛానళ్లనూ ఎక్కువమంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారని బార్క్ స్పష్టం చేసింది.

BIZ-LOCKDOWN-DOORDARSHAN
రామాయణ్ సీరియల్
author img

By

Published : Apr 9, 2020, 3:41 PM IST

లాక్​డౌన్​లో ప్రజలకు వినోదం పంచేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణం సీరియల్​ను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తోంది. వీటితో పాటు మహాభారతం, శక్తిమాన్, బునియాద్ వంటి ప్రముఖ ధారావాహికలనూ మళ్లీ వేస్తోంది.

ఈ నేపథ్యంలో దూరదర్శన్ కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ భారీగా పెరిగింది. గతవారంలో దేశంలోనే అత్యధిక మంది చూసిన ఛానల్​గా అవతరించింది.

BIZ-LOCKDOWN-DOORDARSHAN
రామాయణం సీరియల్

క్లాసిక్స్​తోనే..

లాక్​డౌన్ రెండోవారంలో దూరదర్శన్​కు వీక్షకుల సంఖ్య 40 వేల శాతం పెరిగిందని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్ (బార్క్) తెలిపింది. ప్రైవేట్ ఛానళ్లను మించి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పెరుగుదల నమోదైందని తెలిపింది. రామాయణ్, మహాభారత్ సీరియళ్లే దూరదర్శన్​ను టాప్​లో నిలబెట్టాయని పేర్కొంది బార్క్.

మోదీ పిలుపుతో..

ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో టీవీ వీక్షకుల రేటు భారీగా పడిపోయిందని బార్క్ తెలిపింది. 2015 తర్వాత ఈ పరిస్థితి పునరావృతమవడం ఇదే తొలిసారని పేర్కొంది. అయితే మోదీ ప్రసంగాన్ని 12 లక్షల మంది చూశారని.. దానికి మించి లాక్​డౌన్​పై మోదీ ప్రకటనను అత్యధికంగా 19.7 లక్షల మంది వీక్షించారని బార్క్ ప్రకటించింది.

ప్రైవేటు ఛానళ్లు..

దక్షిణాదిలో సన్ టీవీ కూడా పాత సీరియళ్ల ప్రసారం చేస్తూ వీక్షకులను పెంచుకుంటోంది. హిందీ వినోదాత్మక ఛానళ్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. హిందీ మూవీస్ ఛానళ్లు మాత్రం వినోదాత్మక సెగ్మెంట్లను దాటి రికార్డులను నమోదుచేస్తున్నాయి. మొత్తంగా గతవారంతో పోలిస్తే 4 శాతం వీక్షకులు పెరిగారు. కరోనాకు ముందునుంచి చూస్తే ఇది 43 శాతం పెరిగింది.

స్పోర్ట్ ఛానళ్లు..

ఆశ్చర్యకరంగా.. ప్రస్తుతం ఎలాంటి క్రీడలు జరగకున్నా.. స్పోర్ట్స్ ఛానళ్లకు 21 శాతం వీక్షకులు పెరిగారు. భారత్ గతంలో గెలిచిన క్రికెట్ మ్యాచ్ లు, డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచులను తిరిగి ప్రసారం చేస్తుండటమే ఇందుకు కారణం.

ఇదీ చూడండి: 'ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ కొనసాగింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.