పూరీ జగన్నాథ్.. ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో పూనకం వస్తుంది. యూత్‌కు జోష్ వస్తుంది. డైలాగ్స్ పేల్చడంలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్. 'బద్రి'తో మొదలైన సినీ ప్రయాణం.. 'ఇస్మార్ట్ శంకర్' వరకు అలానే కొనసాగింది. ఈ క్రమంలోనే టాప్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ తీసి, అశేషమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. గతంలో ఈటీవీలో 'ఆలీతో సరదాగా' షోకి వచ్చిన పూరీ.. పలు ఆసక్తికర సంగతుల్ని చెప్పారు.
మీరు రాసిన మొదటి కథ 'తొలి చినుకు' ఎక్కడా పబ్లిష్ కాలేదు. అది మంచి లవ్‌స్టోరీ అని తెలిసింది నిజమేనా?
పూరీ జగన్నాథ్: ఆరో తరగతిలో రాశా. నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. అలా రాసిన వాటిని బుక్‌షెల్ఫ్‌లో పెట్టేవాడిని. అవి మా నాన్న చదివి. 'బాగుంది', 'బాగోలేదు' అని కామెంట్ పెట్టి అక్కడే ఉంచేవారు. దానిపై చర్చలు ఉండేవి కావు. నాకూ ఆ కథ గురించి పెద్దగా గుర్తు లేదు.
'శత్రువు విసిరిన కత్తి కంటే.. స్నేహితుడు విసిరిన కత్తి బలంగా గుచ్చుకుంటుంది' అని ఒక డైలాగ్ రాశారు. మీ నిజ జీవితంలో జరిగిందా?
జరిగింది. చాలా మంది స్నేహితులను నమ్ముతాం. వాళ్లు కత్తి విసరనక్కర్లేదు. పక్క నుంచే పొడుస్తారు. దిగినట్టు కూడా తెలియదు. చాలా మంది స్నేహితులు మోసం చేశారు. ఆస్తి అంతా పోయింది. నడి రోడ్డుపై నిలబడ్డాను.
మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు?
ఇది క్రియేటివ్ జాబ్. సినిమాలు తీసుకోవడంపైనే దృష్టి ఉంటుంది తప్ప, ఇతర విషయాలపై ఉండదు. 'భారీ రెమ్యునరేషన్ తీసుకుందాం. భూములు కొందాం. వ్యాపారం చేద్దాం' ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు డబ్బుపై ఆసక్తిలేకపోవడం, అంతా వాళ్లు చూసుకుంటారులే అని నమ్మడం వల్ల ఇలా జరిగింది.
మీ కెరీర్‌లో ఎంత డబ్బు పోగొట్టుకున్నారు?
నా కెరీర్‌లో దాదాపు రూ.100 కోట్లపైనే పొగొట్టుకున్నా. దర్శకుడిగా నేను సంపాదించినంత డబ్బు ఏ దర్శకుడూ సంపాదించి ఉండరేమో. నన్ను మోసం చేసిన వాళ్లు ఇప్పుడు కనిపించినా వాళ్లను పట్టించుకోను.
- " class="align-text-top noRightClick twitterSection" data="">