ETV Bharat / sitara

బిగ్​బాస్-4 బంపర్ ఆఫర్లు వీరికే! - దివి బంపర్ ఆఫర్

బిగ్​బాస్ సీజన్​-4లోని కంటెస్టెంట్​లకు బంఫర్ ఆఫర్​లు వచ్చాయి. దీంతో వారంతా ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏయే ఆఫర్లు వచ్చాయో తెలుసుకుందాం.

Bigg Boss Telugu season 4 housemates got bumper offers
బిగ్​బాస్-4 కంటెస్టెంట్​లకు బంపర్ ఆఫర్లు!
author img

By

Published : Dec 21, 2020, 5:17 PM IST

ఆదివారం బిగ్‌బాస్‌ సీజన్‌-4 అట్టహాసంగా ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విజేత అభిజీత్‌కు ట్రోఫీతో పాటు, నగదు బహుమతిని అందించారు. కాగా, ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌లలో కొందరికి బంపర్‌ ఆఫర్లు వచ్చాయి. దీంతో వారంతా ప్రస్తుతం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.

  • ఫైనలిస్ట్‌ల్లో ఒకరైన సోహైల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. తన స్మార్ట్‌గేమ్‌తో ఫినాలేలో రూ.25లక్షలు సొంతం చేసుకున్నాడు. ఇక అందులో నుంచి అనాథ శరణాలయానికి రూ.10లక్షలు ఇస్తానంటే, ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకోమని, అందుకు ప్రతిగా రూ.10లక్షలు తాను ఇస్తానని నాగార్జున ప్రకటించారు. ఇక ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అయితే, సోహైల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, సోహైల్‌ ఊతపదం 'కథ వేరే ఉంటుంది' తన సినిమాలో మేనరిజమ్‌గా పెట్టుకుంటానని అడిగారు. అంతే కాదండోయ్‌.. సోహైల్‌ తీసే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటానని, ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటించేందుకు అవకాశం ఇస్తావా? అని సోహైల్‌ను చిరు అడగటం గమనార్హం. దీంతో సోహైల్‌ ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
    Bigg Boss Telugu season 4 housemates got bumper offers
    సోహైల్
  • మరో కంటెస్టెంట్‌ దివికి కూడా చిరంజీవి ఓ ఆఫర్‌ ఇచ్చారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తాను నటించనున్న 'వేదాళం' రీమేక్‌లో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను ఇవ్వనున్నట్లు తెలిపారు. కేవలం ఈ ఒక్క పాత్రే కాకుండా భవిష్యత్‌లో మంచి పాత్రలు ఇవ్వాలని దర్శకులకు సూచిస్తానని అన్నారు. చిరుతో నటించే అవకాశం వచ్చిన దివి తెగ సంబరపడిపోయారు.

    దివి
  • యూట్యూబర్‌, డ్యాన్సర్‌ అయిన మెహబూబ్‌కు చిరు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు. ఫినాలే సందర్భంగా సోహైల్‌ తనకు వచ్చిన రూ.25లక్షల్లో రూ.5లక్షలు మెహబూబ్‌కు ఇవ్వగా, అతను తిరిగి దాన్ని అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. ఈ విషయం తెలిసిన చిరంజీవి వేదికపైనే రూ.10లక్షల చెక్‌ను అందించారు.

    మెహబూబ్
  • నటుడు కుమార్‌సాయి కూడా ఈ సీజన్‌ సందర్భంలో ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. నాగార్జునతో సినిమా చేయాలని ఉందని, అందుకు తాను ఒక కథ సిద్ధం చేశానని ఎలిమినేషన్‌ సందర్భంగా చెప్పాడు. అందుకు నాగార్జున అంగీకారం తెలిపారు. ఫినాలే సందర్భంగా ఆ విషయం ప్రస్తావనకు రాగా, త్వరలోనే కథ వింటానని నాగ్‌ హామీ ఇచ్చారు.

    కుమార్ సాయి
  • ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వ్యక్తి గంగవ్వ. యూట్యూబ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్‌కు రావడం మరో విశేషం. అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్‌ నుంచి వెళ్లిపోయిన ఆమెకు సొంతింటి కలను నాగార్జున నెరవేరుస్తున్నారు. ఫినాలే సందర్భంగా ఇంటికి సంబంధించిన పనులు మొదలు పెట్టిన వీడియోను చూపించారు.

    గంగవ్వ
  • చివరి వారం వరకూ ఇంట్లో ఉండి తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌ చేసిన కథానాయిక మోనాల్‌. ఇప్పటికే ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్‌ తర్వాత పలువురు దర్శక-నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు వేచి చూస్తున్నారని చిరంజీవి స్వయంగా చెప్పడం వల్ల మోనాల్‌ ఆనందానికి అవధులు లేవు.

    మోనాల్

ఇవీ చూడండి: బిగ్​బాస్ సీజన్-4 హైలైట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.