ETV Bharat / sitara

Bigboss season5: కంటెస్టెంట్లపై నాగార్జున ఆగ్రహం - bigg boss worst contestant

'బిగ్‌బాస్‌ సీజన్‌-5'లో(nagarjuna bigg boss 5) భాగంగా పలువురు కంటెస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాఖ్యత నాగార్జున. ఇంతకీ ఏం జరిగిందంటే?

bigboss
బిగ్​బాస్​
author img

By

Published : Oct 16, 2021, 5:42 PM IST

Updated : Oct 16, 2021, 8:23 PM IST

'బిగ్‌బాస్‌ సీజన్‌-5'లో(Bigboss season5 telugu) ఈ వారం జరిగిన 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' టాస్క్‌పై వ్యాఖ్యాత నాగార్జున విచారణ మొదలు పెట్టారు. అంతకు ముందు నామినేషన్స్‌ సందర్భంగా 'మీరంతా నటులు' అంటూ శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున(nagarjuna bigg boss 5) అసహనం వ్యక్తం చేశారు. 'యాక్టర్‌ అంటే చిన్న చూపా' అంటూ శ్రీరామ్‌ను ప్రశ్నించారు.

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రాపర్టీని నాశనం చేసిన రవి, శ్వేత, లోబోలపై(bigg boss 5 contestants) ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రవి చెబితేనే వెళ్లి కుషన్‌ కట్‌ చేసి, తీసుకొచ్చా' అని లోబో చెప్పగా, 'రవి గడ్డి తినమంటే తింటావా' అని నాగ్‌ మండిపడ్డారు. 'కుషన్‌లోని దూదిని తీసుకొచ్చిన విషయం నీకు తెలియదు అని చెప్పకు' అని శ్వేత అనగా, రవి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టాడు. 'ఇవన్నీ చూస్తుంటే నటరాజ్‌ మాస్టర్‌ చెప్పిందే(రవిని గుంటనక్క అన్నారు) కరెక్ట్‌ అనిపిస్తోంది' అని నాగార్జున(bigboss 5 timings) అనడం వల్ల రవి చిన్నబోయాడు. 'సంచాలకులైన కాజల్‌, సిరి ఈ విషయంలో రవిని నమ్మాలా? వద్దా' అని నాగార్జున అడిగారు. మరి వారు ఏం సమాధానం చెప్పారు? ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న 10మందిలో ఎవరు సేవ్‌ అయ్యారు? తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Bigg boss Telugu 5: 'నేను డ్రామా క్వీన్‌ కాదు'.. చిందులేసిన అనీ

Last Updated : Oct 16, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.