ETV Bharat / sitara

'అమృతం ద్వితీయం'లో లాక్​డౌన్ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ - అమృతం ద్వితీయం కొత్త ఎపిసోడ్స్

ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్, హర్షవర్ధన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న వినోదాత్మక వెబ్​ సిరీస్ 'అమృతం ద్వితీయం.' ఉగాది కానుకగా విడుదలైన ఈ సిరీస్​కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్ స్పెషన్ పేరుతో మరో రెండు ప్రత్యేక ఎపిసోడ్లను చిత్రీకరించారు.

అమృతం
అమృతం
author img

By

Published : May 25, 2020, 10:05 AM IST

ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్, హర్షవర్ధన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వినోదాత్మక వెబ్‌ సిరీస్‌ 'అమృతం ద్వితీయం'. ఉగాది కానుకగా 'జీ5' ఓటీటీ ప్లాట్​‌ఫామ్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు ప్రేక్షకాదరణ మెండుగా లభించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ స్పెషల్‌ పేరుతో రెండు ప్రత్యేక ఎపిసోడ్లను‌ ఇటీవల చిత్రీకరించారు. వీటిని మే 27న ప్రేక్షకులకు అందించనున్నారు.

ఈ విషయంపై ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ''గాడ్‌', 'అమృతం'..రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో నటించే అవకాశం దొరకడం నా అదృష్టం. ఇది నాకు గర్వకారణం. ఉగాది రోజున ఎన్నో ప్లాన్లు‌ వేసి ‘అమృతం’ ప్రారంభించాం. కానీ, దేవుడు మరొకటి ప్లాన్‌ చేశాడు. అయితే, షూటింగ్‌ ప్రారంభించిన మొదటి రోజు దర్శకుడు నాకు ఇచ్చిన ప్రశంస ఎప్పటికీ మర్చిపోలేను" అని తెలిపారు.

అమృతం
అమృతం

"ఇందులో అంజి పాత్ర కోసం ఎల్బీ శ్రీరామ్‌ని ఎంచుకున్నాను. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మిగతా ఎపిసోడ్లను‌ ప్రేక్షకులకు అందిస్తాం. ఈ లాక్‌డౌన్‌ స్పెషల్‌ ఎపిసోడ్స్‌ మరో రెండు రోజుల్లో ప్రసారం చేస్తాం." అని దర్శకుడు సందీప్‌ గుణ్ణం తెలిపారు. అనంతరం అమృతం పాత్రధారి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. "బుల్లితెర వీక్షకుల నుంచి గంగరాజుకి వచ్చిన ఒత్తిడి వల్ల 'అమృతం ద్వితీయం' ప్రారంభించారు. అందరికీ నచ్చేది 'అమృతం'. ఎంత బిర్యానీ తిన్నా చివర్లో పెరుగన్నం తినకపోతే ఎలా ఉంటుందో.. 'అమృతం' చూడకపోతే ప్రేక్షకులకు అలా ఉంటుంది" అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.