రఫ్‌గా కనిపించే తాను చాలా సునితమైన మనసు ఉందని సీనియర్ నటుడు మోహన్‌బాబు(mohan babu new movie) అన్నారు. గతాన్ని గుర్తు చేసుకుంటుంటే ఎంతో బాధేస్తుందని చెప్పారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(alitho saradaga latest promo) 250వ ఎపిసోడ్‌కు అతిథిగా విచ్చేసిన ఆయన తన గురించి చాలా విషయాలు వెల్లడించారు. సినీ కెరీర్ గురించి కూడా మాట్లాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విలన్ అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చినట్లు చెప్పిన మోహన్‌బాబు(mohan babu as villain).. నటనలో సీనియర్ ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని అన్నారు. ఆయన సినిమాలే ఎక్కువగా చూసేవాడినని చెప్పారు. భక్తవత్సలంగా ఉన్న తనను మోహన్‌బాబుగా పరిచయం చేసిందని తన గురువు దాసరి నారాయణరావు అని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
1975 నవంబరు 22 తన తొలి సినిమా 'స్వర్గం నరకం' రిలీజ్ అయిందని మోహన్‌బాబు గుర్తుచేసుకున్నారు. 1975లో విడుదలైన 'కన్నవారి కలలు' సినిమాలో అవకాశం కోసం సూపర్‌స్టార్ కృష్ణను బతిమాలాడినట్లు చెప్పారు!
చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పిన మోహన్‌బాబు.. తమ కుటుంబాన్ని పెంచడానికి తన తల్లి చాలా కష్టపడిందని తెలిపారు.
ఒకప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్ చూడటానికి వచ్చినప్పుడు.. హైదరాబాద్‌ను లైఫ్‌లో చూడగలవా అని తనతో ఎవరో చెప్పినట్లు మోహన్‌బాబు అన్నారు. ఇంతకీ ఆయన ఎవరో?. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, చిరంజీవి, నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'(son of india mohan babu teaser) చిత్ర విశేషాలు సహా పలు విషయాలను తెలిపారు. అవన్నీ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచిఉండాల్సిందే. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆలీతో సరదాగా'.. మోహన్ బాబు ఎంట్రీ అదిరిందిగా