ETV Bharat / sitara

Niharika: 'నా భర్తకు ఇష్టం.. అందుకే ఇలా...'

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela).. నిర్మాతగా ఫుల్ బిజీ అయ్యింది. వరుస వెబ్​ సిరీస్​లతో జోరు మీద ఉంది. సినిమాల్లో నటించడంపై ఆసక్తికర విషయం వెల్లడించింది. అంతేకాక వరుణ్ తేజ్, సాయి తేజ్​లతో చేసిన అల్లరి పనులేంటో తెలిపింది.

niharika konidela
నిహారిక
author img

By

Published : Nov 24, 2021, 12:24 PM IST

Updated : Nov 25, 2021, 2:26 PM IST

నిహారిక.. మెగా తారలకు గారాల చందమామ. తన అల్లరితో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న క్యూట్‌ బొమ్మ. నటిగా, నిర్మాతగా తన తండ్రి బాటలో నడుస్తూ.. యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్న నాన్న కూచీ.. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు (Alitho Saradaga Niharika). ఆమెతోపాటు.. ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న నటుడు నిఖిల్‌ కూడా వచ్చారు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో నిహారిక, నిఖిల్‌ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

niharika konidela
నిహారిక

నిహారిక.. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెరిగింది?ఎక్కడ చదివింది?

నిహారిక: మొత్తం హైదరాబాద్‌.. ఫిల్మ్‌నగర్‌లోనే. అపోలో ఆస్పత్రిలో పుట్టాను. ఆ పక్క గల్లీలోనే పెరిగాను. మూడో తరగతి వరకు భవన్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివా. నేను ఎక్కువ పుస్తకాలు మోస్తున్నానని మా అమ్మ వేరే స్కూల్‌లో చేర్పించింది. పదో తరగతి వరకు అక్కడే. ఇంటర్‌ ఓబుల్‌రెడ్డి కాలేజ్‌లో, సెయింట్‌మేరీస్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ చేశా. ఆ తర్వాత చదువుకు బై బై చెప్పా.

చిన్నప్పుడు ఏం అవుదామనుకున్నావ్‌?

నిహారిక: చిన్నప్పుడు టీచర్‌ అవ్వాలనుకున్నా. ఏడో తరగతికి వచ్చాక డాక్టర్‌ అవ్వాలని.. చాలా బలంగా అనుకున్నా. కానీ, మా కుటుంబంలో యాక్టర్స్‌తో పాటు కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ల వద్దకు వెళ్లి డాక్టర్‌ అవుతా అంటే.. 'వద్దమ్మా.. నువ్వు అంత చదవలేవు' అని నన్ను నిరుత్సాహపర్చారు. డాక్టర్‌ అవ్వాలంటే ఇంటర్‌లో బైపీసీ తీసుకోవాలి. అందులో ఫిజిక్స్‌ ఉండేసరికి నాకొద్దు డాక్టర్‌ అనేశా. నాకు ఫిజిక్స్‌ అస్సలు రాదు. దీంతో మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం చేశా. ఫిల్మ్‌ కోర్సు కోసం చెన్నై లయోలా కాలేజ్‌కి వెళ్తానంటే.. మా నాన్న యూసుఫ్‌గూడ కాలేజ్‌లో జాయిన్‌ అవ్వు అన్నారు. మా నాన్న నన్ను ఎక్కడికీ పంపేవారు కాదు.

niharika konidela
కొణిదెల నిహారిక

మీరు హీరోయిన్‌ అవడానికి స్ఫూర్తి ఎవరు?

నిహారిక: నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత నాకు పెద్దనాన్న (చిరంజీవి) తప్ప ఎవరూ తెలియదు. హీరోయిన్‌గా ఎవరూ స్ఫూర్తి లేరు. ఒక యాక్టర్‌గా చిరంజీవి గారే నాకు స్ఫూర్తి. 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్‌', తమిళ్‌లో 'ఒరు నల్ల నాల్‌ పాతు సోల్రే', 'సూర్యకాంతం' సినిమాలు (Niharika Konidela Movies) చేశా.

సూర్యకాంతం.. పాత్ర కోసం పెట్టారా? రియల్‌ లైఫ్‌లోనూ అలాగేనా?

నిహారిక: లేదు. పాత్ర కోసమే పెట్టారు. నేను అలా నప్పానేమో తెలియదు మరి. ఇంట్లో నాన్న నన్ను 'మమ్మీ' అని, అన్న(వరుణ్‌ తేజ్‌) నిహా అని పిలుస్తారు. ప్రేమ ఎక్కువైతే బంగారం అని, మరీ ఎక్కువైతే పంది అని పిలుస్తాడు.

niharika konidela
అన్న వరుణ్​తేజ్​తో

మీ నాన్న ఎప్పుడైనా కొట్టారా?

నిహారిక: ఒక్కసారి కొట్టారు. ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటారు. ఓ సారి మా ఫ్రెండ్‌ బర్త్‌డే ఉంటే.. వెళ్తానని ఇంట్లో చెప్పా. కానీ, ఎప్పుడనేది చెప్పలేదు. ఫ్రెండ్‌ రాగానే వెళ్లిపోయా. కాసేపటికే ఇంట్లోవాళ్లు నేను కనబడట్లేదని కంగారుపడి వెతకడం మొదలుపెట్టారు. నాన్నకి మా ఫ్రెండ్‌ ఇల్లు తెలుసు కానీ, ఫోన్‌ నంబర్‌, ఇతర వివరాలేమీ తెలియదు. అయితే, మా ఫ్రెండ్‌ ఇంటికి సమీపంలోనే ఓ బుక్‌స్టోర్‌ ఉంది. అక్కడే మా నాన్న ఎక్కువ పుస్తకాలు కొంటుంటారు. ఆ షాప్‌కు ఫోన్‌ చేసి నేను ఆ ఇంట్లో ఉన్నానో లేదో చూడమన్నారట. ఉన్నానని తెలుసుకొని కారులో వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఏమైంది నాన్న అంటుండగానే వీపుపై ఒక్కటి ఇచ్చారు. నన్ను కొట్టిన తర్వాత పది రోజులు మా పెద్దనాన్నకి 'ఈ చేతులతో కొట్టాను' అని చెప్పుకొని బాధపడ్డారట. అమ్మ అయితే.. తినడం విషయంలో చాలాసార్లు కొట్టింది. మా అన్న(వరుణ్‌ తేజ్‌) కొట్టడు. కానీ, ఏడిపిస్తాడు. దీంతో నేనే కొడతా. అన్న చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. కానీ మాటకారి.

సాధారణంగా హీరోయిన్స్‌ తమ గోల్‌కి చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ, మీరు ఇంత త్వరగా చేసుకోవడానికి కారణమేంటి?

నిహారిక: ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా.. కెరీర్‌ ఏం మారలేదు. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో.. పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉంది. కొందరు హీరోయిన్​లు వ్యక్తిగత కారణాలతో సినిమాలు మానేసి ఉండొచ్చు. మా ఆయనకు (Niharika Konidela Husband) నేను సినిమాల్లో చేయడం ఇష్టం.

niharika konidela
భర్త చైతన్యతో

మీ ఆయనతో పరిచయం ఎక్కడ?

నిహారిక: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లికి ముందు ఆయనతో నాకు పరిచయం లేదు. మా అన్నకు తెలుసు. తొమ్మిదో తరగతిలో మా అన్నకు క్లాస్‌మేట్‌ తను.

పెద్దనాన్న మెగాస్టార్‌.. బాబాయ్‌ పవర్‌స్టార్‌. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా..! హీరోయిన్‌గా ఎందుకు, వేరే ఏదైనా చేయాలన్న ఆలోచన రాలేదా?

నిహారిక: నాకు సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లో కష్టం, ప్రతిభ కచ్చితంగా ఉండాలి. వీటితోపాటు అదృష్టం కూడా ఉండాలి. సినిమాలు కాకుండా వేరే ఏమన్నా చేద్దామని 'టీచ్‌ ఫర్‌ ఇండియా' అనే కార్యక్రమం కింద పిల్లలకు పాఠాలు చెప్పాను. అయినా.. సినిమాలపై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశా. మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నా.

తొలిసినిమా (ఒక మనసు) విడుదలయ్యాక మీ కుటుంబసభ్యుల స్పందన?

నిహారిక: నిజానికి ఆ సినిమా హిట్‌ అవలేదు. స్పందన కూడా అలాగే ఉంది. ఎవరైనా మంచి సినిమా చేస్తున్నామనే మొదలుపెడతారు. కానీ, కొన్ని కారణాల వల్ల అవుట్‌పుట్‌ అలా వచ్చింది. సినిమా ఇష్టపడి చేశాను కాబట్టి. మా కుటుంబంలో ఎవరూ సినిమా బాగలేదు అని చెప్పలేదు. నా కష్టం వాళ్లు చూశారు.

నాన్న తన బ్యానర్‌లో ఎన్ని సినిమాలు తీశారు? వాటిలో మీకు ఏది నచ్చింది?

నిహారిక: 12 సినిమాలు, వాటిలో నాకు నచ్చింది 'బావగారు! బాగున్నారా'. నాకు తెలిసి నేను ఎక్కువసార్లు చూసింది ఆ సినిమానే.

'ఆరెంజ్‌ చిత్రంతో చాలా నష్టపోయా. ఆ సమయంలో నా తమ్ముడు నాకు చాలా సహాయం చేశాడు' అని మీ నాన్న భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని మీ నాన్న మీకు చెప్పారా?

నిహారిక: ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఏం చెప్పలేదు. కానీ, తెలుసు. అంతకిందకు పడి.. అంతే వేగంగా ఎదగడం మా నాన్న తప్ప ఇంకెవరు చేయలేరు.

niharika konidela
'అలీతో సరదాగా' షోలో నిహారిక

టీవీలో సక్సెస్‌ అవడం, కుమారుడిని (వరుణ్‌ తేజ్‌) హీరో చేయడం, కూతురికి పెళ్లి జరిపించడం.. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? రిలాక్స్‌గా ఉన్నారా?

నిహారిక: చాలా సంతోషంగా ఉన్నారు. నాకు, మా నాన్నకు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదు. మొదట్లో డబ్బులు అవసరం కాబట్టి.. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఏదైనా తనకు నచ్చితేనే చేస్తారు. ఈ మధ్య స్వయంగా యూట్యూబ్‌ ఛానల్‌ కూడా మొదలుపెట్టారు.

నిర్మాతగా వెబ్‌సిరీస్‌ చేస్తున్నట్టు విన్నాను?

నిహారిక: ఇది నాలుగో వెబ్‌సిరీస్‌. మొదట 'ముద్దపప్పు ఆవకాయ్‌' చేశా. ఆ తర్వాత నాన్నతో 'నాన్న కూచీ' చేశా. కొంతమంది యంగ్‌స్టర్స్‌తో స్నేహంపై ఒక వెబ్‌సిరీస్‌ తీశా. ఇప్పుడు 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' తీశాం. దర్శకుడు శోభన్‌ గారి రెండో అబ్బాయి సంగీత్‌ శోభన్‌తో ఈ సిరీస్‌ చేశాం.

చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ ఎవరంటే ఎక్కువ ఇష్టం?

నిహారిక: మా నాన్న గారు.

చరణ్‌, వరుణ్‌, బావ(సాయిధరమ్‌ తేజ్‌)?

నిహారిక: మా అన్న ఎప్పుడు, ఏ సమయంలో ఫోన్‌ చేసినా ఏం కావాలని అడుగుతాడు. ఆ తర్వాత ఎక్కువగా తేజ్‌ బావ(సాయిధరమ్‌ తేజ్‌) ఇష్టం. నేను, ధరమ్‌ తేజ్‌, చిన్న అత్త, మా నాన్న.. మా నలుగురికి కొంచెం మెంటల్‌ ఉంది. ఇంట్లో ఏ వేడుక జరిగిన మొదట మా నలుగురి గొంతులే వినిపిస్తాయి. చరణ్ అన్న నాకు అండగా ఉంటాడు. ఆయన మాటల్లో భరోసా ఉంటుంది.

వరుణ్‌ నటించిన చిత్రాల్లో ఏదంటే ఇష్టం?

నిహారిక: గద్దలకొండ గణేష్‌. ఆ సినిమాలో అన్న ఏడ్చే సీన్‌ చూసి నేనూ ఏడ్చేశా. నాన్నని కూడా యాంగ్రీమ్యాన్‌ అంటారు కానీ.. చాలా సాఫ్ట్‌.

niharika konidela
నిహారిక

స్టైలిష్‌ స్టార్‌??

నిహారిక: మామయ్య కొడుకే అయినా.. బన్నీని అన్న అని పిలవడం అలవాటు. బన్నీ సినిమాల్లో తన ఫొటోలను ఒక్కచోట పెడితే.. ఏది ఏ సినిమాలోదో చెప్పేయొచ్చు. అంత వైవిధ్యముంటుంది. లుక్‌లో అంత శ్రద్ధ తీసుకుంటుంటాడు. జులాయి సినిమాలో బన్నీ అన్న అంటే ఇష్టం.

పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తున్నావు?

నిహారిక: ప్రొడక్షన్‌ కాకుండా.. ఓ సూపర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. వివరాలు ఇప్పుడు చెప్పలేను. అయితే, మా బృందంలో ఓ వ్యక్తి ఉన్నాడు. నన్ను అందరు నసపిట్ట అంటారు కదా.. ఆయన్ను చూస్తే.. ఆ టైటిల్‌ తనకు ఇస్తారు. ఆయనే నిఖిల్‌ విజయేంద్ర సింహా. నిఖిలూగా చాలా ఫేమస్‌. ఆయనో యూట్యూబర్‌. ప్రస్తుతం నేను చేసే వెబ్‌సిరీస్‌లో లీడ్‌ రోల్‌ చేస్తున్నాడు.

నిహారిక కీలక పాత్ర పోషిస్తున్న వెబ్‌సిరీస్‌లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్న నిఖిల్‌.. కార్యక్రమంలో మధ్యలో విచ్చేసి సందడి చేశారు.

nikhil
యాంకర్ నిఖిల్

ఏ ఊరు మీది?ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావ్‌?

నిఖిల్‌: అమ్మవాళ్లది కొవ్వూరు. నాన్నది అమలాపురం. చిన్నప్పట్నుంచి యాంకరింగ్‌ అంటే ఆసక్తి. కొంచెం హడావిడి ఎక్కువగా చేస్తుంటా.

చాలా మంది స్టార్స్‌ ఉన్నారు.. తన్నే ఎందుకు ఎంచుకున్నావ్‌?

నిహారిక: ఈ ప్రాజెక్టులో నేను కేవలం నటిని మాత్రమే.

నిఖిల్‌.. మీ ఇంట్లో ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎవరైనా ఉన్నారా?

నిఖిల్‌: మా అన్నయ్య శౌర్య.. సినిమాలకు రైటర్‌. ప్రస్తుతం మేం నటిస్తున్న ప్రాజెక్టుకి మా అన్నయ్యే రైటర్‌.. డైరెక్టర్‌.

ఏ ఉద్దేశంతో డిజిటల్ వేదికపై అడుగుపెట్టారు?

నిఖిల్‌: డిజిటల్‌ వేదికలంటే ఆసక్తే లేదు. టీవీ అంటేనే ఇష్టం. ఇందుకోసం చాలా ప్రయత్నించా.

కొణిదెల, అల్లు కుటుంబం కాకుండా ఏ హీరో ఇష్టం?

niharika konidela
నిహారిక ముచ్చట్లు

నిహారిక: రవితేజ, నాగార్జున

నిఖిల్‌: అల్లు అర్జున్‌.

మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కొట్టారా?

నిహారిక: నిఖిల్‌ని కొట్టలేదు కానీ, ఇతని వల్ల వీళ్ల అన్నని బాగా కొట్టారు.

నిఖిల్‌: నన్ను 8వ తరగతిలో కొట్టారు. మళ్లీ ఎప్పుడూ కొట్టలేదు.

ఒక నిమిషంలో నిహారిక గురించి నీ అభిప్రాయం చెప్పు.

నిఖిల్‌: రోజూ పొగుడుతూనే ఉంటాను సర్‌. ఎంత పొగిడినా తిడుతూనే ఉంటుంది.

నిఖిల్‌ గురించి నీ అభిప్రాయం?

నిహారిక: మా కుటుంబంలో తమ్ముళ్లు ఉన్నారు. కానీ, నిఖిల్‌తో ఎప్పుడు క్లోజ్‌ అయ్యానో తెలియదు. సోదరుడిలా మారిపోయాడు. అందుకే అంతలా ఏడిపిస్తాను. నిఖిల్‌ది కల్మషం లేని హృదయం. తన చుట్టూ ఉండేవాళ్లు సంతోషంగా ఉండాలనుకుంటాడు. అందుకే అంత దగ్గరయ్యాను అనుకుంటా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Niharika: ఆ అందంపై.. మనసు పారేసుకున్నా : నిహారిక

Last Updated : Nov 25, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.