ETV Bharat / sitara

సమీక్ష: బాలయ్య 'రూలర్' బాక్సాఫీస్ వద్ద మెప్పించిందా..!​ - తెలుగు సినిమా వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

రూలర్ సినిమా రివ్యూ
బాలకృష్ణ-వేదిక-సోనాల్​ చౌహాన్
author img

By

Published : Dec 20, 2019, 3:55 PM IST

టైటిల్‌తోనే తన సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సినిమాలను వేగంగా పూర్తి చేయడంలో యువ కథానాయకులు కూడా ఆయనను అందుకోలేరంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు చెప్పిన మాట వేదవాక్కులా పాత్ర కోసం ఎంతటి రిస్క్‌ అయినా చేస్తారు. అందుకే మాస్‌లో ఆయనకు విపరీతమైన క్రేజ్‌. ఇక వెండితెరపై డైలాగులు చెప్పడం, యాక్షన్‌ సీన్లలో ఆయనకు ఆయనే సాటి. ఈ వయసులోనూ ఉరకలెత్తే ఉత్సాహం బాలకృష్ణ సొంతం. అందుకే సెంచరీ సినిమాల తరవాత మరింత జోరు పెంచారు. ఈ ఏడాది తన మూడో సినిమా 'రూలర్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కె.ఎస్‌.రవికుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? 'రూలర్‌' వెనుక కథేంటి? బాలకృష్ణ ఎన్ని గెటప్‌లలో కనిపించారు? కె.ఎస్‌.రవికుమార్‌ టేకింగ్‌ ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే..

సరోజని నాయుడు(జయసుధ)ఒక పెద్ద కంపెనీకి ఛైర్మన్‌. అనుకోని పరిస్థితుల్లో అర్జున్‌ ప్రసాద్‌(బాలకృష్ణ) ఆమెకు కనిపిస్తాడు. గతం మర్చిపోయిన అర్జున్‌ను తన ఇంటికి తీసుకెళ్లి, కొడుకులా పెంచుతుంది. కంపెనీ బాధ్యతలు అప్పగిస్తుంది. తన తెలివితేటలతో అర్జున్‌ ప్రసాద్‌ కంపెనీని నెం.1 స్థానానికి తీసుకెళ్తాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక ప్రాజెక్టు అర్జున్‌ప్రసాద్‌ కంపెనీకి దక్కుతుంది. అయితే, అక్కడ ప్రాజెక్టు చేపట్ట వద్దని సరోజని చెబుతుంది. గతంలో అక్కడ ప్రాజెక్టు చేపడదామనుకున్న సరోజినీని మంత్రి భవానీనాథ్‌ ఠాగూర్‌(పరాగ్‌ త్యాగి) అడ్డుకుని, అవమానించాడని చెబుతుంది. దీంతో తన తల్లికి అవమానం జరిగిన చోటుకి వెళ్లి, భవానీని, అతని మనుషులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు అర్జున్‌ ప్రసాద్‌, అక్కడకు వెళ్లిన అర్జున్‌ను చూసి అందరూ ధర్మ (బాలకృష్ణ) అని పిలుస్తారు? ఇంతకీ ధర్మ అతనెవరు? అతనికీ అర్జున్‌ ప్రసాద్‌కీ సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

balakrishna in ruler cinema
రూలర్​లో రైతు పాత్రలో హీరో బాలకృష్ణ

ఎలా ఉందంటే..

బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్‌, ఎమోషన్‌, డైలాగ్‌లు, ఇవన్నీ ఆశిస్తారు అభిమానులు. పాత్రలో వివిధ గెటప్‌లు ఉంటాయని అనుకుంటారు. అవన్నీ పొందుపరిచిన సినిమా ఇది. 'జైసింహా' కోసం బాలకృష్ణతో పని చేసిన కె.ఎస్‌.రవికుమార్‌ ఆయనకు ఏం కావాలో తెలుసు. ఆ అంశాలతో కథను అల్లుకున్నారు. కథానాయకుడు గతం మర్చిపోవడం, అతనికి ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ ఉండటం అన్నది రొటీన్‌ ఫార్ములా. ఈ సినిమాకు కోసం దాన్నే నమ్ముకున్నారు. ఎప్పుడైతే ఈ నేపథ్యంతో కథ సాగుతుందో సినిమాలోని సన్నివేశాలన్నీ గతంలో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. బాలకృష్ణను జయసుధ చేరదీయడం, ఒక సీఈవోగా మార్చడం వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సీఈవోగా బాలకృష్ణ విన్యాసాలు, బ్యాంకాక్‌ సన్నివేశాలు, సొనాల్‌ చౌహాన్‌తో డ్యూయెట్‌లు తదితర వ్యవహారాలతో ప్రథమార్ధం కథ సాఫీగానే సాగిపోతుంది. షాకింగ్‌ ఎలిమెంట్స్‌ ఏవీ ఉండవు. అబ్బుర పరిచే సన్నివేశాలు కూడా ఏవీ రావు. బాలయ్య తనదైన నటన, స్టెప్‌లతో ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాడు. బ్యాంకాక్‌ సన్నివేశాల్లో కామెడీ అంతగా పండలేదు. అవన్నీ సాగదీతగా అనిపిస్తాయి.

balakrishna in ruler
రూలర్​లో స్టైలిష్​లుక్​లో నందమూరి బాలకృష్ణ

వేదిక రాకతో కథలో మలుపు ఉందన్న సంగతి అర్థమవుతుంది. యూపీ వ్యవహారాలు, రైతుల సమస్య వాటితో కథనం వేగం పుంజుకుంది. ద్వితీయార్ధంలో పోలీస్‌ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్రను కూడా మాస్‌ను అలరించేలా రూపొందించారు. ద్వితీయార్ధంలో రైతుల సమస్యలతో పాటు, పరువు హత్యలను ప్రస్తావించారు. ప్రథమార్ధం చూసిన ప్రేక్షకుడికి ద్వితీయార్ధంలో మరో సినిమా చూసిన భావన కలుగుతుంది. యాక్షన్‌ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో ఫైట్‌ తర్వాత ఫైట్‌ వచ్చి పడిపోతుంటాయి. అవన్నీ అభిమానులను అలరించినా, కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. అర్జున్‌ ప్రసాద్‌ ఎవరు? అతని ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటో తెలిసిన తర్వాత ఒక భారీ క్లైమాక్స్‌తో సినిమాను ముగించారు. పాత కథను కొత్తగా తీయడంలో దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ తన మార్కు చూపించలేకపోయారు అక్కడక్కడా బాలకృష్ణ తనదైన శైలిలో చేసిన విన్యాసాలు ఊరటను కలిగిస్తాయి.

balakrishna in ruler cinema
రూలర్​ సినిమాలో ఉగ్రరూపంలో హీరో బాలకృష్ణ

ఎవరెలా చేశారంటే..

బాలకృష్ణ పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. సీఈవోగా చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. పోలీస్‌ పాత్ర మాసీగా సాగింది. రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించారు. బాలకృష్ణ వేసిన స్టెప్‌లు ఆయన అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటాయి. ఇద్దరు కథానాయికలు ఉండగా, తొలి భాగాన్ని సోనాలి చౌహాన్‌, ద్వితీయార్ధాన్ని వేదిక పంచుకొన్నారు. ఇద్దరి పాత్రలు గ్లామర్‌ కోసమే. ప్రకాష్‌రాజ్‌, భూమిక, నాగినీడు పాత్రలు ఆకట్టుకుంటాయి. ధన్‌రాజ్‌, రఘుబాబు, రఘు, సప్తగిరిలు చేసిన కామెడీ పండలేదు. పాటలు బాలయ్య అభిమానుల కోసం డిజైన్‌ చేసినట్లు ఉన్నాయి. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువగా వినిపిస్తుంది. పరుచూరి మురళి ఇచ్చిన కథేమీ కొత్తది కాదు. దానికి ట్రీట్‌ చేసిన విధానం కూడా అలాగే సాగింది. స్క్రీన్‌ప్లే మలుపులు ఇవ్వడంలో కె.ఎస్‌.రవికుమార్‌ దిట్ట. కానీ, ఆ నైపుణ్యం కనిపించలేదు. చాలా వరకూ రొటీన్‌ సన్నివేశాలతోనే సినిమా సాగుతుంది. బాలకృష్ణ నుంచి ఒక మాస్‌, మాసాలా సినిమా చూడాలనుకునేవారికి మాత్రం ఈ సినిమా పండగ.

balakrishna-vedika
రూలర్ సినిమాలో బాలకృష్ణ-వేదిక

బలాలు

+ బాలకృష్ణ
+ స్టెప్‌లు
+ పోరాట సన్నివేశాలు

బలహీనతలు

- కథ, కథనం
- కామెడీ ట్రాక్‌లు

చివరిగా..

అభిమానులకు మాత్రమే 'రూలర్‌' ఎంటర్‌టైనర్‌.

ఇవీ చూడండి.. రివ్యూ: 'దబంగ్​ 3'తో​ భాయ్​ అలరించాడా?

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
FRIDAY 20 DECEMBER
0800
LOS ANGELES_ First reaction rolls in from 'Star Wars' fans as the 'The Rise of Skywalker' opens in theatres.
1300
LONDON_ The end of an era: The 'Star Wars' cast talk about life beyond the sci-fi saga.
2100
NEW YORK_ Jennifer Beals talks about reviving groundbreaking series 'The L Word.'
COMING UP ON CELEBRITY EXTRA
US_ Kelly Clarkson, Shailene Woodley and Jim Carter think back to when they first realized they were famous.
PASADENA_ 'Star Wars' stars say new film showcases real-life 'close knit relationship.
NEW YORK_ Busy Philipps on her family's holiday traditions and how to keep the magic of Christmas alive for kids.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_Camille Schrier from Virginia crowned new Miss America
LONDON_Christopher Nolan has been awarded a CBE for services to the film industry at Buckingham Palace
NEW YORK_ AP Breakthrough Entertainer Jonathan Majors didn't let ambition get in the way of success.
SEOUL_ Industry experts pick K-pop songs of the decade: '4 Walls' and 'Fantastic Baby'.
LONDON_ Rihanna, Helena Bonham Carter and the rise of streetwear are the fashion highlights of the decade.
LONDON_ Sam Mendes, George MacKay and Dean-Charles Chapman discuss their epic one-shot war movie, '1917'.
NASHVILLE_ Country star Keith Urban gets into Christmas spirit with original holiday song.
CHICAGO_ Holiday fun for rescued otters at Chicago aquarium.
LONDON_ Lines for Harry Styles' 'Fine Line' pop up shop
CELEBRITY EXTRA
LOS ANGELES/NEW YORK_ Stars Boyd Holbrook, Maddie Hasson and Kaitlyn Dever reveal which other celebrities they've been mistaken for..
PASADENA_ 'Star Wars' star John Boyega hasn't rewatched 'The Last Jedi,' but spent the summer watching 'Love Island'.
NEW YORK_ Julianne and Derek Hough, Mario Lopez, more debate real vs. fake Christmas trees.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.