ETV Bharat / sitara

రివ్యూ: 'అశ్వథ్థామ'గా నాగశౌర్య మెప్పించాడా?

నాగశౌర్య, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. రమణ తేజ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి 'అశ్వథ్థామ' అలరించిందా? లేదా? అన్నది సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

నాగశౌర్య చెప్పిన 'అశ్వథ్థామ' కథ మెప్పించిందా

author img

By

Published : Jan 31, 2020, 1:16 PM IST

Updated : Feb 28, 2020, 3:46 PM IST

సొంత నిర్మాణ సంస్థలో వరుసపెట్టి సినిమాలు తీస్తోన్న యువహీరో నాగశౌర్య. ఐరా క్రియేషన్​లో 'ఛలో'తో ఘన విజయాన్ని అందుకున్న ఇతడు.. రెండో సినిమా 'నర్తనశాల'తో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తప్పు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో తానే ఈసారి పెన్ను పట్టి, తన స్నేహితుడి చెల్లికి జరిగిన ఓ సంఘటన నేపథ్యంగా ఏడాదిన్నరపాటు శ్రమించి 'అశ్వథ్థామ' కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథపై నమ్మకంతో.. సినిమా పేరును గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అంతలా గుండెలపై రాసుకున్న 'అశ్వథ్థామ'లో ఏముందో ఈటీవీ భారత్ సమీక్షలో తెలుసుకుందాం.

nagashourya Ashwthama Review
నాగశౌర్య చెప్పిన 'అశ్వథ్థామ' కథ మెప్పించిందా

కథేంటంటే

అమెరికా నుంచి గణ(నాగశౌర్య) తన చెల్లెలి పెళ్లి కోసం హైదరాబాద్ వస్తాడు. నిశ్చితార్థం ఘనంగా జరిపిస్తారు. ఇక పెళ్లి అనేలోపు గణ చెల్లెలు ఆత్మహత్య యత్నం చేసుకుంటుంది. తన చెల్లెలు అలా ఎందుకు చేసిందో తెలుసుకున్న గణ.. అందుకు కారణమైన వారెవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన చెల్లెలిలాగే చాలా మంది అమ్మాయిలు మోసపోయారని, కానీ మోసం చేస్తుంది ఎవరో తెలియదని ప్రేయసి నేహా(మెహరీన్ )కు వివరిస్తాడు. ఆ రాక్షసున్ని పట్టుకునేందుకు అన్వేషిస్తుంటాడు. చివరకు అసలు వ్యక్తి ఎవరనేది కనిపెట్టిన గణ ఏం చేశాడు? తన చెల్లిని ఎలా సంతోషంగా ఉంచాడనేది అశ్వథ్థామ కథ.

ఎలా ఉందంటే

ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇటీవలే 'రాక్షసుడు' లాంటి సినిమాను చూసిన ఆడియెన్స్.. సైకో కిల్లర్స్ ఎంత భయంకరంగా ఉంటారో తెరపై చూసి నివ్వరపోయారు. అలాంటి కోవకే చెందిన మరో కథే అశ్వథ్థామ. సమాజంలో అమ్మాయిలపై జరుగుతోన్న లైంగిక నేరాల్లో మరో కోణాన్ని ఆవిష్కరించిందీ చిత్రం. మానవ మృగాల బారినపడి ఒక అమ్మాయి తనకే తెలియకుండా గర్భవతి అవడం, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక ఆత్మహత్యకు పాల్పడటం వంటి సంఘటనలు దేశంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులుగానే మిగిలిపోయి తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నాయి. అలాంటి ఓ యథార్థ సంఘటన నేపథ్యంగా కథ రాసుకున్న నాగశౌర్య... తెరపై మానవ మృగాలు ఎలా ఉంటారో చూపించాడు. మాన, ప్రాణాల పట్ల అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరించే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థంలో చెల్లెలికి జరిగిన అన్యాయం.. దానికి కారకులను వెతికిపట్టుకునే ప్రయత్నంతో సాగుతుంది. ద్వితీయార్థానికి వచ్చేసరికి అమ్మాయిలను మోసం చేస్తుంది ఎవరో రివీల్ చేసిన దర్శకుడు.. విలన్ ఆచూకీ కనిపెట్టి అతన్ని మట్టు పెట్టడంతో కథను క్లైమాక్స్​కు చేర్చాడు. అయితే ఇటీవల నాగశౌర్య డైరెక్ట్ చేసిన భూమి లఘు చిత్రంలోని పాయింట్​ను ఈ కథకు జోడించి ప్రేక్షకులను అశ్వథ్థాముడిగా ప్రశ్నించడం కొసమెరుపు.

ఎవరెలా చేశారు

కథ దగ్గర నుంచి నటన వరకు నాగశౌర్య నిజంగానే అశ్వథ్థాముడయ్యాడనే చెప్పాలి. ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను తెరపై చూపించాలనే తపన... ప్రతి ఫ్రేమ్​లోనూ కనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించాడు. చెల్లెలికి జరిగిన సంఘటనపై ఒక అన్నగా మదనపడటం, దానికి కారకులను వెతికిపట్టుకునే క్రమంలో యాక్షన్ ఎపిసోడ్స్​తో అదరగొట్టాడు. పెళ్లి సీన్​లో నవ్వుతూనే ఒక కంట కన్నీరొలికిస్తూ తనలోని నటున్ని ఆవిష్కరించాడు. నేహా పాత్రలో నటించిన మెహరీన్ ఒక పాటతోనే కాకుండా గణ పాత్రకు అవసరమైన సపోర్ట్ అందిస్తూ కథను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగానే నిలిచింది. మనిషి కోరిక తీర్చుకుంటాడు, మానవ మృగాలు వాంఛలు తీర్చుకుంటాయంటూ డాక్టర్ మనోజ్ కుమార్​గా సైకో విలన్ పాత్రలో నటించిన బెంగాళీ నటుడు జిషుసేన్ గుప్తా... ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రేపిస్ట్​గా, సైకో కిల్లర్​గా నటించి తెలుగు తెరకు మరో విలన్ దొరికాడు అనేలా మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ వారి పరిధి మేరకు సరిపోయాయి. దర్శకుడిగా అడుగుపెట్టిన రమణతేజ... తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. శౌర్య రాసుకున్న కథకు న్యాయం చేయడం కోసం తీవ్రంగానే శ్రమించాడు. అమెరికా దాకా వెళ్లి స్క్రీన్ ప్లే పై చదువుకున్న రమణతేజ... అశ్వథ్థామలో ఆ మార్క్ పెద్దగా చూపించలేకపోయాడు. డీఓపీ మనోజ్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదనిపించింది. జీబ్రాన్ సమకూర్చిన నేపథ్య సంగీతం అశ్వథ్థామకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరశురాం శ్రీనివాస్ మాటలు ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ ఈ సినిమా కథకు ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది.

బలం:

కథ, నాగశౌర్య, నేపథ్య సంగీతం

బలహీనత:

కథనం, పాటలు

చివరగా: ఆడపిల్లలు జాగ్రత్త అంటోన్న 'అశ్వథ్థామ'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

AP Video Delivery Log - 0500 GMT News
Friday, 31 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0405: US Impeach Closing AP Clients Only 4252122
Senate wraps up questions for impeachment trial
AP-APTN-0351: Malaysia Virus Campaign AP Clients Only 4252120
Campaign to educate Malaysians on coronavirus
AP-APTN-0341: South Korea Virus Evacuees 2 AP Clients Only 4252119
SKorean virus evacuees taken into quarantine
AP-APTN-0331: US ID Missing Children Deadline Part must credit KIFI: Part no access Idaho Falls; Part no use US broadcst networks; Part no re-sale, re-use or archive; Part must credit National Center for Missing & Exploited Children 4252118
Mother fails to produce missing US children
AP-APTN-0322: Japan Ski Accident No access Japan 4252117
Avalanche hits Japan ski resort; 1 feared dead
AP-APTN-0313: US Trump Rally AP Clients Only 4252116
Trump rails against Democratic rivals
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.