ETV Bharat / sitara

నాని జీరో లుక్ అదుర్స్​​.. 'మార్క్​ ఆంటోనీ'గా విశాల్ - dj tillu

కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. నాని, నజ్రియా జంటగా నటిస్తున్న 'అంటే సుందరానికి!', విశాల్ కొత్త సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

vishal upcoming movie
ante sundaraniki
author img

By

Published : Jan 1, 2022, 7:25 PM IST

Updated : Jan 1, 2022, 9:31 PM IST

హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఈ సినిమాలో నాని జీరో లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కేపీవీఎస్​ఎస్​పీఆర్​ సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని.​ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆకట్టుకునేలా ఫస్ట్​లుక్..

సుధీర్ ​బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా ఫస్ట్​లుక్​ న్యూ ఇయర్​ సందర్భంగా విడుదలైంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్​, బెంచ్​మార్క్​ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు.

sudheer babu
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

'మార్క్​ ఆంటోనీ'గా విశాల్..

నటుడు విశాల్​ 33వ సినిమాకు 'మార్క్​ ఆంటోనీ' అనే టైటిల్​ను ఖారారు చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో ఎస్​జే సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​ ఆకట్టుకుంటోంది.

vishal upcoming movie
'మార్క్​ ఆంటోనీ'

సంక్రాతికే 'డీజే టిల్లు'

'గుంటూర్​ టాకీస్'​ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన కొత్త చిత్రం 'డీజే టిల్లు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్​గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

dj tillu
'డీజే టిల్లు'

15న 'హీరో' సందడి

అశోక్​గల్లా, నిధిఅగర్వాల్​ జంటగా నటించిన సినిమా 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రానికి జిబ్రాన్​ సంగీతం అందిస్తున్నారు.

hero movie telugu
'హీరో'

ఇదీ చూడండి: New Movie Posters: కొత్త ఏడాది.. కొత్త కొత్త పోస్టర్లు కళకళ

Last Updated : Jan 1, 2022, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.