ETV Bharat / sitara

Cinema : మీ ఇంటిని సినిమా షూటింగ్‌కి ఇవ్వాలనుకుంటున్నారా? - houses rent for cinema shootings by filmapia

‘అల వైకుంఠపురంలో...’ సినిమాలో చూపించే ఆ పెద్ద సౌధం ఎంత గొప్పగా ఉంటుందో! పాతదైతేనేం, ‘ఫిదా’లోని కథానాయిక ఇంటి లోగిలిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో! మరి చిన్నదో పెద్దదో మీ ఇంటినీ ఇలా సినిమా షూటింగ్‌లకి అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి.. ఇప్పుడు అందుకోసమూ వచ్చిందో స్టార్టప్‌. దాని పేరు ‘ఫిల్మాపియా’. ఇప్పటిదాకా లొకేషన్‌ మేనేజర్లకే పరిమితమైన ఈ పనిని తన చేతుల్లోకి తీసుకుని ఆ రంగంలో కొత్త ముద్ర వేస్తోంది!

house for shooting, house for film shooting, filmapia
షూటింగ్​కు ఇల్లు, షూటింగ్​కు అద్దె ఇల్లు, ఫిల్మాపియా
author img

By

Published : Jun 13, 2021, 1:28 PM IST

కొందరికి ఇల్లంటే ఎన్నో కలల పొదరిల్లు! తమకున్న స్థలం చిన్నదైనా సరే చక్కటి అభిరుచితో వైవిధ్యంగా నిర్మించుకుంటారు. ఎవరైనా దాన్ని చూసి ‘వావ్‌’ అంటే గర్వంతో గాల్లో తేలిపోతుంటారు. మరి అలాంటి ఇళ్లని షూటింగ్‌లకూ వాడితే... అలా చూపించినందుకు ఊహించనంత మొత్తం అద్దెగా వస్తే ఎంత బాగుంటుందో కదా! అందుకు తాము సాయం చేస్తామంటారు ఐవీ, బెంజమిన్‌ జాకబ్‌ దంపతులు. ఆ ఇద్దరే ‘ఫిల్మాపియా’ వ్యవస్థాపకులు.

మీ ఇంటిని షూటింగ్​కి ఇస్తారా?

ఇప్పటికే హైదరాబాద్‌లోని 20 ఇళ్లని ఇలా సినిమా షూటింగ్‌ల కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇలా వందలాది నిర్మాణాలని షూటింగ్‌ల కోసం నమోదుచేసుకున్నారు. తెలుగు పరిశ్రమతోపాటూ హిందీ, కన్నడ, తమిళం, మలయాళ సినిమా పరిశ్రమల కోసం వీటిని వాడుతున్నారు. ఒక్క సినిమాలనే కాదు నెట్‌ఫ్లిక్స్‌, వయాకామ్‌, కలర్స్‌ వంటి బడా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల వెబ్‌సిరీస్‌లూ, సీరియళ్లకీ వీటిని అద్దెకిస్తున్నారు. మింత్రా, ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలూ తమ ప్రకటనలకి ఈ సంస్థని ఆశ్రయిస్తున్నాయి. అంత భారీ సంస్థలే కాదు... మామూలు షార్ట్‌ఫిల్మ్‌లు తీసేవాళ్లకీ తగ్గ నిర్మాణాలని చూపించి సాయపడుతున్నారు.

ఫిల్మాపియా

భలే మొదలైంది..

ఐవీ, బెంజమిన్‌ దంపతులది బెంగళూరు. ఐవీ మైనింగ్‌ సంస్థలో ఉద్యోగినిగా ఉండేవారు. ఆమె భర్త బెంజమిన్‌ ఓ ఐటీ సంస్థలో పనిచేస్తుండేవాడు. ఇద్దరికీ సినిమాలన్నా, పర్యటనలన్నా ఇష్టం. ఆ రెండింటినీ కలగలిపి సినిమాల్లో కనిపించే అందమైన లొకేషన్స్‌కి తరచూ వెళ్లడమంటే సరదా వాళ్లకి. అలా ‘ఏమాయ చేసావె’లో చూపించిన సెయింట్‌ మేరీస్‌ ఫొరెన్‌ చర్చీ, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ క్యాంపస్సూ మణిరత్నం ‘దిల్‌ సే’లో చూపించిన లెహ్‌ పరిసరాలూ ఇతరత్రా తమకు నచ్చిన సినిమాల లొకేషన్‌ల వివరాలన్నీ చెబుతూ ఓ వెబ్‌సైట్‌ తయారుచేశారు. ‘మాకు అప్పట్లో సినిమావాళ్లెవరూ తెలియదు. దర్శకులో, నిర్మాతలో ఫలానా పాట షూటింగ్‌ కోసం ఫలానా చోటకి వెళ్లాం అని ఇంటర్వ్యూలు ఇస్తే ఫాలో అయ్యేవాళ్లం. వీలుంటే మేమే అక్కడికెళ్లి వెతికే వాళ్లం. ఐవీ మైనింగ్‌ రంగంలో పనిచేసేది కాబట్టి తనకి శాటిలైట్‌ ద్వారా మనం కోరుకున్న ప్రాంతాన్ని వెతికిపట్టుకునే నైపుణ్యం ఉండేది. అలా ఎన్నో ప్రదేశాల్ని గుర్తించాం!’ అంటారు బెంజమిన్‌ జాకబ్‌.

2014లో వీళ్ల వెబ్‌సైట్‌ని చూసిన ఓ ప్రకటనల సంస్థ తమకి ఓ వైపూ రాళ్లూ రప్పలూ, మరోవైపు ఎత్తైన గడ్డి ఉండేలాగా ఓ ప్రదేశాన్ని వెతికి పెట్టమని అడిగిందట. ఆ సంస్థ కోసం బెంగళూరు దగ్గరున్న నందిహిల్స్‌ని ఎంపిక చేసిచ్చారు. అది మింత్రా సంస్థకి చెందిన యాడ్‌. అరుదైన ప్రదేశాలపైన వీళ్లకున్న అభిరుచి చూశాక ఆ తర్వాతి నాలుగు యాడ్‌ల లొకేషన్స్‌ బాధ్యత వీళ్లకే అప్పగించిందట మింత్రా. వాటిని చూసిన కన్నడ సినిమావాళ్లూ ఈ దంపతుల్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. వాళ్ల కోసం అందమైన ఇళ్లనీ అద్దెకు తీసుకుని సిద్ధం చేయడం ప్రారంభించారు ఈ దంపతులు. వీటితో ఆదాయం బాగానే వస్తుండటంతో 2017లో తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి ‘ఫిల్మాపియా’ సంస్థని ఏర్పాటుచేశారు. ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టిన ఈ స్టార్టప్‌ రెండో ఏడాదిలోనే కోటిరూపాయల టర్నోవర్‌ని అందుకుందట!

‘ప్రేమనగరాలు’ అక్కర్లేదు..

‘ప్రేమనగరాలు’ అక్కర్లేదు..

సినిమారంగంలో షూటింగ్‌లకి కావాల్సిన స్థలాల్నీ, ఇళ్లనీ ఎంపిక చేసే పనిని ‘లొకేషన్‌ మేనేజర్స్‌’ చూస్తుంటారు. చిత్ర పరిశ్రమలో సుమారు 70 ఏళ్లుగా సాగుతున్న ఈ వృత్తిలో ఇళ్లూ లేదా ప్రదేశాల అద్దెకి సంబంధించిన రుసుమూ, వస్తువులు ఏవైనా దెబ్బతింటే ఇవ్వాల్సిన నష్టపరిహారమూ, అనుమతులూ వంటి వ్యవహారాలన్నీ ‘నోటిమాటతోనే’ జరుగుతుంటాయి. అందువల్ల ఏదైనా సమస్య వస్తే అటు యజమానులకీ ఇటు ప్రొడక్షన్‌ వాళ్లకీ ఇబ్బందులుండేవి. దాన్ని కాస్త ప్రొఫెషనల్‌గా మార్చి ముందస్తు ఒప్పందాలు చేసుకునేలా చూస్తోంది ఫిల్మాపియా. తమకి ‘ప్రేమనగర్‌’లాంటి అద్భుతమైన ఇళ్లు ఉంటేనే షూటింగ్‌లకి ఇవ్వొచ్చనే భావనని మార్చి... మామూలు ఇళ్లున్న సామాన్యులనీ ఈ రంగంలోకి తెస్తోంది. అలా ఇప్పటిదాకా 170 ప్రాజెక్టులకి సేవలు అందించింది!

ఐవీ, బెంజమిన్‌ జాకబ్‌ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.