అలనాటి బాలీవుడ్ నటి కుంకుమ్(86) జులై 28(మంగళవారం)న తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతూ బాంద్రాలోని తన నివాసంలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈమె అసలు పేరు జైబున్సిసా. బిహార్‌లోని షేక్పురా జిల్లా హుస్సేనాబాద్‌లో ఏప్రిల్ 22, 1934న జన్మించారు. 1954లో 'ఆర్ పార్ట' చిత్రంలోని 'కబీ ఆర్ కబీ పార్ లాగా తీరే నాజర్' పాటతో నర్తకిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. మొత్తంగా కెరీర్లో పలు భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 'మిస్టర్ ఎక్స్ ఇన్ బొంబాయి' (1964), 'మదర్ ఇండియా' (1957), 'సన్ ఆఫ్ ఇండియా' (1962), 'కోహినూర్' (1960), 'ఉజాలా', 'నయా దౌర్', 'శ్రీమాన్ ఫుంటూష్', 'ఏక్ సపెరా ఏక్ లుటెరా' చిత్రాలతో ప్రసిద్ది చెందారు.
ఇది చూడండి లెఫ్ట్‌నెంట్ అధికారి బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్