ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్లో(forbes list 2021) ఈసారి దక్షిణాది స్టార్స్ మెరిశారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్లో(forbes list) చోటు దక్కించుకున్న 'కేజీఎఫ్' స్టార్ యష్(kgf yash).. ఈ ఘనత సాధించిన తొలి కన్నడ వ్యక్తిగా నిలిచారు. మ్యాగజైన్లో ఇతడి గురించి ప్రచురితమైన ఆర్టికల్‌లో.. స్వస్థలం మైసూరు నుంచి యష్ బెంగళూరుకు పారిపోవడం, ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకోవడం, ఆ తర్వాత 'కేజీఎఫ్'(kgf movie release date) సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ తెచ్చుకోవడం గురించి ఇందులో రాశారు.
ఈ కథానాయకుడి లైఫ్‌స్టోరీతో పాటు దక్షిణాదిలో హీరోలు ధీటుగా రాణిస్తూ, అభిమానులతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న నయనతార(nayanthara movies list) కూడా ఫోర్బ్స్ వార్షిక మ్యాగజైన్లో(forbes india) చోటు సంపాదించింది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్(dulquer salmaan movies) కూడా ఈ మ్యాగజైన్లో నిలిచారు. లాక్డౌన్లో దుల్కర్ సినిమాలు బాగా ప్రాచుర్యం పొందాయి. దీంతో పలు భాషా ప్రేక్షకుల అతడికి అభిమానులుగా మారారు. ప్రస్తుతం తెలుగులో దుల్కర్.. 'లెఫ్టినెంట్ రామ్' సినిమా చేస్తున్నారు. వీరితోపాటే దక్షిణాదికి చెందిన దాదాపు 24 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కూడా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్లో చోటు సంపాదించారు.