హీరో విజయ్ దేవరకొండ.. 'డియర్ కామ్రేడ్'తో ఈ ఏడాది వెండితెరపై సందడి చేశాడు. ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిన అవసరముంది.
ఈ సినిమా చివరి షెడ్యూల్‌తో పాటు, నిర్మాణనంతర కార్యక్రమాలను ఏక కాలంలో పూర్తి చేయనున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్బెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు.
ఇదే కాకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాలోనూ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
ఇది చదవండి: 'డియర్ కామ్రేడ్'తో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు కష్టాలు!