అమెరికా పాప్ గాయని జెన్నిఫర్, విల్సన్ జంటగా ఎస్టీఎక్స్ ఫిల్మ్ సంస్థ 'మ్యారీ మీ' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. క్యాట్ కాయిరో ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ఏడాది చివరన చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కథను జానీ రోగర్స్, తమీ సాగెర్ అందించగా.. హర్పెర్ డిల్ కథలో మార్పులు చేశారు. ఈ చిత్రం బాబీ క్రాస్బో రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. జెన్నిఫర్ ప్రధాన పాత్రధారిగా కనువిందు చేయనుంది.
జెన్నిఫర్ ఓ రాక్స్టార్ను పెళ్లిచేసుకుంటుంది. అయితే అతడు మోసం చేసినందున ఓ కార్యక్రమంలో అందరి మధ్య బ్రేకప్ చెబుతూ.. అక్కడ ఉన్న జనంలోంచి ఓ వ్యక్తిని(విల్సన్) పెళ్లి కొడుకుగా ఎంపిక చేసుకుంటుంది. లోపెజ్, విల్సన్ కలిసి 1997లో వచ్చిన 'అనకొండ' సినిమాలో కలిసి పనిచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">