ETV Bharat / sitara

'విడాకులు తీసుకోవడమే అతిపెద్ద వైఫల్యం' - విల్ స్మిత్ వార్తలు

తన జీవితంలో విడాకుల తీసుకోవడం అతిపెద్ద వైఫల్యమని చెప్పాడు హాలీవుడ్ నటుడు విల్​స్మిత్. మరోవైపు నటి ఏంజెలీనా జోలీ.. బ్రాడ్​పిట్​తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

Will Smith: Divorce was the ultimate failure for me
'నా జీవితంలో విడాకులు అంతిమ వైఫల్యం'
author img

By

Published : Jun 20, 2020, 3:38 PM IST

మొదటి భార్య షెరీ జంపినోతో విడాకులు తీసుకోవడమే తన జీవితంలో అతిపెద్ద వైఫల్యమని అన్నాడు హాలీవుడ్​ స్టార్ విల్​స్మిత్. ఫాదర్స్​డే సందర్భంగా రెడ్​టేబుల్​ షోలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు. తన విజయాలతో పాటు జీవితంలోని అనేక విశేషాలను వెల్లడించాడు.

"విడాకులు తీసుకోవడం నా జీవితంలో నిరుపయోగమైన విషయం. ఆ సంఘటన నా జీవితంలో అతిపెద్ద వైఫల్యం. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. అయితే అలా చేయాల్సిన పరిస్థితులు ఏంటో అర్థం కాలేదు"

విల్​స్మిత్​, హాలీవుడ్​ నటుడు

1992-1995 వరకు షెరీ జంపినోతో ఉన్న విల్​స్మిత్.. 1997లో పింకెట్​ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి జేడెన్​ అనే కుమారుడుతో పాటు, 19 ఏళ్ల కుమార్తె ఉంది.

విల్​ స్మిత్.. 'మెన్​ ఇన్​ బ్లాక్'​, 'ద పర్ష్యూట్​ ఆఫ్​ హ్యాపీనెస్​', 'అల్లాదీన్'​ తదితర సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని అలరించాడు.

నేను తీసుకున్న నిర్ణయం సరైనదే: ఏంజెలీనా

మరోవైపు హాలీవుడ్​ హాట్​ నటి ఏంజెలీనా జోలీ.. బ్రాడ్​ పిట్​తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది.

Will Smith: Divorce was the ultimate failure for me
ఏంజెలీనా జోలీ

"నా కుటుంబం బాగుకోసమే విడిపోయా. ఇది మంచి నిర్ణయమే. కొంతమంది నా మౌనాన్ని అలుసుగా తీసుకుని, అసత్య వార్తలను చూపిస్తున్నారు. కానీ నిజమేంటో నా పిల్లలు తెలుకున్నారని గుర్తించా. ప్రస్తుతం ఆ చిన్నారుల భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా"

ఏంజెలీనా జోలీ, హాలీవుడ్​ నటి

గత దశాబ్ద కాలంలో ఎంతో బాధను అనుభవించానని, బయటకు కనిపించని గాయం తాలూకు మచ్చలెన్నో ఉన్నాయని ఏంజెలీనా చెప్పింది. జీవితం చాలా మలుపులు తిరుగుతుందని, కోరుకన్నట్లు స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా ఉండటం కష్టమని తెలిపింది.

ఇదీ చూడండి:'కొడుకును కోల్పోయినట్లు అనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.