హాలీవుడ్లో సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ లాంటి హీరోలు ఉన్నారు. కానీ భారత్‌లో ఎవరు అంటే గుర్తొచ్చేది క్రిష్. ఈ పాత్ర హృతిక్ రోషన్ తప్ప మరొకరు చేయలేరు అనేంతగా లీనమైపోయాడు. ఇప్పటివరకు మూడు భాగాలు రాగా.. త్వరలో నాలుగో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం స్వయంగా హృతిక్ రోషనే చెప్పాడు.
"క్రిష్ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లాలని నాకూ ఉంది. ఇప్పుడే వార్ చిత్రం వచ్చింది. దీని తర్వాతా మా నాన్నతో(రాకేశ్ రోషన్) చర్చించి పునఃప్రారంభిస్తాం. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కోలుకునేంత వరకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాం. ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైంది. వెంటనే ప్రారంభిస్తాం " -హృతిక్ రోషన్, బాలీవుడ్ హీరో
ఈ సిరీస్‌లో మొదటి చిత్రం కోయీ మిల్ గయా(2003), అనంతరం క్రిష్(2006), క్రిష్-3(2013) సినిమాలు వచ్చాయి. ఈ మూడింటికి రాకేశ్ రోషనే దర్శకత్వం వహించాడు. అయితే క్రిష్-4కు హృతిక్‌తో కాబిల్ తెరకెక్కించిన సంజయ్ గుప్తా దర్శకుడిగా వ్యవహరించే అవకాశముంది. 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
ఇదీ చదవండి: కంగనాను కొట్టాడు.. నాపై యాసిడ్ పోశాడు: రంగోలీ