ETV Bharat / sitara

కాజల్‌ కారణంగా చిక్కుల్లో స్టార్‌హీరో సినిమా! - కాజల్ అగర్వాల్​ తాజా వార్తలు

కమల్​హాసన్​- శంకర్​ కాంబినేషన్​లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఇండియన్​-2'(indian 2 movie). పలు కారణాలతో ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిందీ చిత్ర షూటింగ్. అయితే కాజల్​ అగర్వాల్​(kajal aggarwal movies) కారణంగా మరోసారి చిక్కుల్లో పడినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఏమైందంటే..?

kajal aggarwal
కాజల్‌ అగర్వాల్
author img

By

Published : Nov 12, 2021, 10:11 AM IST

Updated : Nov 12, 2021, 11:44 AM IST

అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇండియన్‌-2'(indian 2 movie). షూట్‌ ప్రారంభించిన నాటి నుంచి ఈ సినిమా ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. సెట్‌లో క్రేన్‌ ప్రమాదం జరగటం.. టీమ్‌లో ముగ్గురు సభ్యులు మృత్యువాత పడటం వల్ల వాయిదా పడిన ఈ షూట్‌.. ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బడ్జెట్‌ విషయంలో దర్శకనిర్మాతల మధ్య మనస్పర్థలు రావడం వల్లే షూట్‌ నిలిచిపోయిందని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థతో సయోధ్య కుదరడం వల్ల 'ఇండియన్‌-2'(indian 2 movie)ను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని శంకర్‌ భావించారట. అతి త్వరలో షూట్‌ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ తరుణంలో మరోసారి 'ఇండియన్‌-2'(indian 2 movie) టీమ్‌ కాజల్‌ అగర్వాల్​ (kajal aggarwal movies) వల్ల చిక్కుల్లో పడినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

ఆమె స్థానంలో..

గతేడాది వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూతో(kajal aggarwal husband) ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన కాజల్‌.. త్వరలో తల్లికాబోతున్నట్లు కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరోగ్యపరిస్థితుల రీత్యా ఆమె 'ఇండియన్‌-2'(indian 2 movie) షూట్‌లో జాయిన్‌ కావడానికి ఆసక్తి కనబర్చటం లేదట. దీంతో చిత్రబృందం.. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ కోసం వెతుకులాట ఆరంభించిందని.. హీరోయిన్‌ దొరికిన వెంటనే కాజల్‌(kajal aggarwal movies) ఎపిసోడ్స్‌ మొత్తాన్ని రీషూట్‌ చేయనున్నారని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు ప్రెగ్నెన్సీ విషయంపై ఇటీవల కాజల్‌ స్పందిస్తూ.. "సరైన సమయం వచ్చినప్పుడు విషయాన్ని బయటపెడతా" అని అన్నారు.

ఇదీ చూడండి: పవన్ 'భీమ్లానాయక్' కొత్త రిలీజ్​ డేట్ ఇదే​!

Last Updated : Nov 12, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.