ఈద్ కానుకగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. థియేటర్లు మూతపడటం వల్ల నేరుగా డిజిటిల్ మాధ్యమంలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనిపై స్పందించాడు భాయ్‌జాన్. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాకు నష్టాలు వస్తాయని తెలుసని వ్యాఖ్యానించాడు. అన్నింటికీ సిద్ధపడే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని స్పష్టం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"రాధే' సినిమాకు చాలా తక్కువ కలెక్షన్లు వస్తాయని తెలుసు. ఈ సినిమా 10-15 కోట్లు కూడా సాధించదని అనుకుంటున్నా. ఇలాంటి నష్టాన్ని ఎవరైనా కోరుకుంటారా? కొందరు నా అత్యధిక వసూళ్లను చూసి సంతోషపడతారు. మరికొందరు నా చిత్రాల తక్కువ కలెక్షన్లు చూసి ఆనందిస్తారు. 'రాధే' సినిమా వల్ల మేము నష్టాలబారిన పడతామని తెలుసు. అయినా ఈ చిత్రాన్ని కచ్చితంగా విడుదల చేస్తాం. ఈ సినిమాను విడుదల చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా."
-సల్మాన్ ఖాన్, నటుడు
ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నాడు సల్మాన్. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. దిశా పటానీ, రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. మే 13 ఈ సినిమా జీఫ్లెక్స్ వేదికగా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">