ETV Bharat / sitara

'భారతీయుడు 2' సినిమాకు శంకర్​ హామీ - భారతీయుడు 2 శంకర్​

'భారతీయుడు 2' మిగిలిన చిత్రీకరణపై దర్శకుడు శంకర్​ తరఫు న్యాయవాది స్పష్టతనిచ్చారు. రాబోయే ఐదు నెలల్లో ఈ సినిమాలో మిగిలిన షూటింగ్​ పార్ట్​ను పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థకు కోర్టు ద్వారా తెలిపారు.

Director Shankar assures Lyca
శంకర్​-భారతీయుడు 2
author img

By

Published : Apr 22, 2021, 9:28 PM IST

లోకనాయకుడు కమల్​హాసన్ హీరోగా శంకర్​ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భారతీయుడు 2'. లాక్​డౌన్​ కారణంగా గతేడాది షూటింగ్​ నిలిచిపోయింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్​, నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్​ మధ్య విభేదాలు తలెత్తాయి. ​

ఇంతలోనే తన తర్వాతి రెండు చిత్రాలను రామ్​చరణ్​, రణ్​వీర్​ సింగ్​లతో రూపొందించనున్నట్లు శంకర్​ ఇటీవలే ప్రకటన చేశారు. దీంతో 'భారతీయుడు 2' ప్రాజెక్టు పక్కనపెట్టినట్లేనని కోలీవుడ్​ వర్గాలు అనుకున్నాయి. అయితే ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే ప్రాజెక్టు చేయరాదని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ కోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో జూన్​ నుంచి అక్టోబరు వరకు అంటే ఐదు నెలల్లో 'భారతీయుడు 2' షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్​ తరఫున న్యాయవాది స్పష్టం చేశారు. హాస్యనటుడు వివేక్​ మరణంతో.. సినిమాలోని ఆయన పాత్ర సన్నివేశాలను మళ్లీ షూట్​ చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్​ 28కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి.. చీరకట్టు అందాలతో 'వకీల్​సాబ్'​ భామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.