ETV Bharat / sitara

జాన్వీ​ సినిమాల్లోకి రావడం శ్రీదేవికి ఇష్టం లేదా? - sridevi not likely to send janhvi kapoor into film industry

వెండితెరపై అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి.. ఎందరో అభిమానులకు ఆరాధ్య దేవతగా నిలిచింది. ఆమెకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారిలో జాన్వీ తల్లిబాటలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 'ధడక్'​ చిత్రంతో నటిగా కెరీర్​ ప్రారంభించింది. అయితే జాన్వీ సినిమాల్లోకి రావడం శ్రీదేవికి ఇష్టంలేదట.

actress sridevi latest news
జాన్వీ సినిమాల్లోకి రావడానికి శ్రీదేవి ఒప్పుకోలేదా?
author img

By

Published : Jun 26, 2020, 6:47 PM IST

జాన్వీ కపూర్​.. స్టార్​ కిడ్​గా పుట్టిన ఈ భామ బాలీవుడ్​లో అరంగేట్రం చేస్తూనే సంచలన విజయం నమోదు చేసింది. తొలి సినిమా 'ధడక్'​తో దాదాపు 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటికి మూడు చిత్రాల్లోనే వెండితెరపై అలరించినా.. తనదైన అందంతో నెట్టింట మంచి ఫాలోయింగ్​ తెచ్చుకుంది. తల్లి బాటలోనే సినిమాల్లో రాణించేందుకు విభిన్న కథలు, నాయికా ప్రాధాన్య చిత్రాలను ఎంచుకుంటోంది. అయితే తన కూతురు జాన్వీ సినిమాల్లోకి రావడం స్వర్గీయ శ్రీదేవికి ఇష్టం లేదట. ఈ విషయాన్ని జాన్వీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.

actress sridevi latest news
జాన్వీ కపూర్​, శ్రీదేవి

"నేను సినిమాల్లోకి వస్తానంటే అమ్మ ఒప్పుకోలేదు. నా నిర్ణయం మార్చుకోమని సూచించింది. అయితే నేను చాలాసార్లు నచ్చజెప్పి, ఒప్పిస్తే ఆఖరికి అంగీకరించింది. అందుకు చాలారోజులు కష్టపడ్డా. మేము తనలా కష్టపడకూడదని అనుకునేది. తను పనిచేసిన సినిమా ఇండస్ట్రీలోకి నేను రాకూడదని కోరుకునేది. అందుకే మొదట ఒప్పుకోలేదు"

-జాన్వీ కపూర్​, బాలీవుడ్​ నటి

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణం తర్వాత ఈ అమ్మడుపైనా మండిపడ్డారు నెటిజన్లు. బంధుప్రీతి పేరిట విమర్శలు చేశారు. ఈమె నటి శ్రీదేవి- నిర్మాత బోనీకపూర్ కూతురు కావడమే ఇందుకు కారణం.​

actress sridevi latest news
శ్రీదేవి, జాన్వీకపూర్​

'ధడక్‌' హిట్‌ తర్వాత జాన్వీ నెట్‌ఫ్లిక్స్‌ హారర్‌ సిరీస్‌ 'ఘోస్ట్‌ స్టోరీస్‌'లో కనిపించింది. ఆమె నటించిన 'గుంజాన్‌ సక్సేనా‌: ది కార్గిల్‌ గర్ల్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ చేతిలో 'దోస్తానా-2', 'తఖ్త్‌', 'రూహీ అఫ్జానా' ఉన్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.