'రాధే'లోని ఓ ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు హీరో సల్మాన్‌ఖాన్‌ను పొరపాటున కొట్టేశానని చెప్పాడు గౌతమ్ గులాటి. ఈ సినిమాలో ప్రతినాయకుడు నటించిన ఇతడు.. అంతకు ముందు పలు చిత్రాల్లో హీరోగా చేశాడు. దీంతో దెబ్బలు తినడానికి బదులు 'రాధే'లో హీరోకు అనుకోకుండా పంచ్ ఇచ్చినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సల్మాన్భాయ్కు సారీ చెప్పినట్లు గౌతమ్ తెలిపాడు.
ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో 'రాధే', ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో సల్మాన్ సరసన దిశాపటానీ హీరోయిన్గా నటించింది. ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
ఇది చదవండి: 'రాధే' లీక్‌పై సల్మాన్ ఫైర్