ETV Bharat / sitara

'ట్రైలర్​' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?

చిత్రపరిశ్రమలో ఏ సినిమానైనా ప్రేక్షకులకు చేరవేసేది ప్రచార చిత్రాలు మాత్రమే. సినిమాలోని పాత్రలతో పాటు కథాంశంపై వీక్షకులకు కొంత అవగాహన కోసం చూపించే చిన్న వీడియోనే ట్రైలర్​. అయితే ఈ ట్రైలర్లను ఎవరు కనిపెట్టారు? దీని వెనకున్న కథేమిటో తెలుసుకుందాం.

what is the history behind of movie trailer
'ట్రైలర్​' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?
author img

By

Published : Dec 4, 2020, 3:52 PM IST

ట్రైలర్‌.. సినిమాకు ఒక శాంపిల్‌. కథేంటి?నటీనటుల ప్రదర్శన ఎలా ఉండనుంది? సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుంది? వంటి ప్రశ్నలకు దాదాపు 2 నిమిషాలు ఉండే ట్రైలర్‌తో చిత్రబృందం కొంతమేర సమాధానం చెబుతుంది. పూర్తిగా తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. అలా ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచడంలో ట్రైలర్‌లు కీలక పాత్ర వహిస్తున్నాయి. అందుకే చిత్రబృందాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని రూపొందించి.. ట్రైలర్లను విడుదల చేస్తాయి. నిజానికి, ఒకప్పుడు ఈ ట్రైలర్లను సినిమా పూర్తయిన తర్వాత ప్రదర్శించేవారు. ట్రైలర్‌ అంటేనే చివర్లో ఉండేదని అర్థం వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ ట్రైలర్లను సినిమాలు విడుదల కాకముందే ఎందుకు వదులుతున్నారు? అసలు ఈ ట్రైలర్లను ఎవరు కనిపెట్టారు? తెలుసుకోవాలంటే.. ఇది చదవండి..

1910 తర్వాత హాలీవుడ్‌లో సినిమా రంగం పుంజుకుంది. అప్పట్లో ప్రేక్షకులు కొంత సొమ్ము చెల్లించి థియేటర్లోకి వెళ్లి ఎన్ని సినిమాలైనా చూసే అవకాశముండేది. థియేటర్ యాజమాన్యం ప్రేక్షకుల కోసం విరామం లేకుండా ఫీచర్‌ సినిమాలు, కార్టూన్లు, షార్ట్‌ ఫిల్మ్‌ ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుసపెట్టి ప్రదర్శించేవి. అయితే ఒక సినిమా పూర్తయి మరో సినిమా మొదలు కావడానికి కాస్త సమయం పట్టేది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిల్స్‌ గ్రాన్‌లుండ్‌ భావించారు.

what is the history behind of movie trailer
ఈ ట్రైలర్లను ఎవరు కనిపెట్టారు?

అదే నాంది పలికింది

1913లో ఆయన మార్కస్‌ ల్యూ అనే థియేటర్‌ సంస్థలో మేనేజర్‌గా ఉండేవారు. అలాగే 'ది ప్లెషర్‌ సీకర్స్‌' అనే సంగీత కార్యక్రమానికి నిర్మాత. అయితే థియేటర్‌లో ప్రదర్శించబోయే ఈ సంగీత కార్యక్రమంపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించడం కోసం ఆయన వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. సంగీత కళాకారులు రిహర్సల్స్‌ చేస్తున్న ఫుటేజ్‌లతో స్వల్ప వ్యవధి ఉన్న ఒక ప్రచార చిత్రాన్ని రూపొందించారు. దాన్ని థియేటర్లలో ప్రదర్శించే సినిమాల రీళ్లకు చివర అంటించారు. దీంతో సినిమా చివర్లో ఆయన రూపొందించిన ప్రచారం చిత్రం ప్రదర్శితమైంది. ప్రేక్షకులకు ఆ ప్రచార చిత్రం కొత్తగా అనిపించడమే కాదు, ఆ కార్యక్రమాన్ని చూడాలన్న ఆసక్తి పెంచింది. అలా కార్యక్రమం భారీ విజయం అందుకుంది.

తొలి ప్రయోగం

గ్రాన్‌లుండ్‌ ఆలోచన సినీపరిశ్రమకు తెగ నచ్చేసింది. అదే ఏడాది విలియమ్‌ సీలిగ్‌ అనే నిర్మాత గ్రాన్‌లుండ్‌ సహాయంతో తాను నిర్మించిన ఒక సీరియల్‌ చిత్రానికి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందోననే ఉత్సుకతను రేకెత్తించే చిన్న వీడియోలను రూపొందించారు. వాటిని ప్రదర్శించి తదుపరి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి కల్పించే విధంగా చేయగలిగారు. ఇలాంటి సీరియల్‌ చిత్రాలతో పాటు వేర్వేరు సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా మరో సినిమా రీళ్లకు చివర్లో అతికించేవారు. ఒక సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమా ప్రచార చిత్రం ప్రదర్శించడం వల్లే వీటికి 'ట్రైలర్స్‌'అని పేరొచ్చింది.

ప్రివ్యూనే ట్రైలర్​గా..

1920లో ఈ ట్రైలర్లను రూపొందించడం కోసం ప్రత్యేక సంస్థలు పుట్టుకొచ్చాయి. అయితే, 1930ల్లో అసలు సమస్యను సినీవర్గాలు గమనించాయి. ప్రేక్షకులు ఒక సినిమా పూర్తి అయ్యాక వెంటనే ప్రదర్శితమయ్యే ట్రైలర్లను చూడకుండానే వెళ్లిపోయేవారు. దీంతో ఫలితం లేదనుకున్న సినీవర్గాలు చిత్రం ప్రదర్శించే ముందే ట్రైలర్స్‌ను ప్రదర్శించాలని నిర్ణయించాయి. వాటిని ప్రివ్యూస్‌ అనేవాళ్లు. కానీ, ట్రైలర్స్‌ అనే పదం బాగా అలవాటు కావడం వల్ల దాన్నే కొనసాగించారు. అలా సినిమా చివర్లో ఉండే ట్రైలర్లు.. సినిమా ముందుకు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల సినిమా ట్రైలర్‌లను రూపొందించి టీవీల్లో, వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాంలో ఏ సమయంలోనైనా విడుదల చేసుకునే అవకాశం లభిస్తోంది. థియేటర్లలోనూ సినిమాకు ముందు, విరామ సమయంలో ట్రైలర్లను ప్రదర్శిస్తున్నారు.

ఇదీ చూడండి: 'సలార్' అర్థం చెప్పిన ప్రశాంత్ నీల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.