తమ మితిమీరిన చర్యలతో మనుషులు, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని చెప్పింది నటి రకుల్‌ప్రీత్ సింగ్. ప్రపంచమంతా కరోనా వేగంగా విస్తరిస్తున్నా, భారత్‌లో ఈ వైరస్ ప్రభావం తక్కువ ఉండటంపై భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది.
"కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూస్తుంటే బాధేస్తోంది. కానీ మన దేశంలో అంతటి ప్రమాదకర పరిస్థితులు లేనందుకు భగవంతుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రకృతి నిత్యం తన విధులు నిబద్ధతతో చేసుకుపోతుంటుంది. కానీ, మనం ఏమాత్రం కృతజ్ఞతా భావం చూపించకుండా మితిమీరిన చర్యలతో దానికి అపకారం చేస్తున్నాం. అందుకే ఈ అనర్థాలన్నీ. కాబట్టి ఇక నుంచైనా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కృతజ్ఞతా భావంతో మెలగాలి" అని చెప్పింది రకుల్. ఆమె ప్రస్తుతం కమల్‌హాసన్ 'భారతీయుడు 2'లో నటిస్తోంది.
ఇదీ చూడండి... నేను ఓ 'వేస్ట్ లేడీ': శ్రుతి హాసన్