ETV Bharat / sitara

'పారిశుద్ధ్య కార్మికులను చులకనభావంతో చూడొద్దు' - వివి వినాయక్​ కరోనా పాట

ప్రజల్లో కరోనాపై ఉన్న భయాందోళనలను తొలగించేందుకు రచించిన 'కరోనా రక్కసి' పాటను ఆవిష్కరించారు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్. పారిశుద్ధ్య కార్మికులను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

vinayak
వినాయక్​
author img

By

Published : Jun 16, 2020, 5:34 PM IST

పారిశుద్ధ్య కార్మికులను చులనభావంతో చూడొద్దు

కరోనాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు ప్రముఖ దర్శకుడు బాబ్జీ రచించిన 'కరోనా రక్కసి' పాటను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ పాటను ప్రజా నాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి ఆలపించగా యువ సంగీత దర్శకుడు ప్రేమ్ స్వరాలు అందించారు. ఈ సందర్భంగా పాటను ఆసాంతం వీక్షించిన వినాయక్.. బాబ్జీ, లక్ష్మణ్, ప్రేమ్​లను అభినందించారు. దీంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులను చులకనభావంతో చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

"కరోనా విపత్తు సమయంలో లేదా ఇంకెప్పుడైనా.. పారిశుద్ధ్య కార్మికులను చులకనభావంతో చూడొద్దు. వైరస్​కు ధనికులు, పేదలనే తేడా లేదని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఉపాధి లేక అల్లాడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకొని మానవత్వాన్ని చాటండి. ప్రజలు ఈ మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రతలు పాటించండి."

-వి.వి.వినాయక్, ప్రముఖ దర్శకుడు.

ప్రస్తుతం 'సీనయ్య' చిత్రంతో హీరోగా మారబోతున్నారు వినాయక్​. లాక్​డౌన్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చూడండి : 'సుశాంత్​ పరిస్థితి నాకూ ఎదురైంది.. కానీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.