వివాదాస్పద ట్వీట్‌పై ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. తానేం తప్పుచేయలేదని తొలుత బుకాయించినా... చివరకు క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశాడు.
"ఒక్కోసారి కొన్ని విషయాలు చూడగానే మనకు వినోదాన్ని కలిగిస్తాయి. అవి కొందరికి అలా అనిపించకపోవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో దాదాపు రెండు వేల మందికిపైగా పేద ఆడపిల్లల బాధ్యతను తీసుకున్నాను. అటువంటి నేను ఓ మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడలేను. నా ట్వీట్ వల్ల ఏ ఒక్క మహిళ మనస్తాపం చెందినా అది తప్పే. అందుకు క్షమాపణలు. ఆ ట్వీట్‌ను తొలగించేశాను" అంటూ మరో ట్వీట్ చేశాడు వివేక్
విషయమేంటంటే..
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ను కించ పరిచేలా ఉన్న ఓ మీమ్‌ను వివేక్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి సోనమ్ కపూర్, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు పలువురు వివేక్‌పై విరుచుకుపడ్డారు. ఓ నటుడు అయి ఉండి మరో నటిని కించపరిచేలా ఈ పోస్టులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి.. వివేక్ ఒబెరాయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు