ఎన్నికలవేళ దేశమంతా ఎగ్జిట్ పోల్స్‌పై చర్చిస్తోన్న వేళ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అభ్యంతరకర ట్వీట్ చేశాడు. ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్లను ప్రస్తావిస్తూ వివేక్ చేసిన పోస్ట్‌పై తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లతో సహా పలువురు ప్రముఖులు వివేక్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు.
"ఇది అనుచితమైన ట్వీట్... చాలా నిరాశ కలిగిస్తోంది" అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఒబెరాయ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా స్పందించింది. "ఈ పోస్ట్ చూస్తుంటే అసహ్యమేస్తోంది" అంటూ ట్వీట్ చేసింది.
"మహిళలకు గౌరవమివ్వాలి" అని మరొకరు ట్వీట్ చేశారు.
ఈ విషయంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ వివేక్ ఒబెరాయ్‌కు నోటీసులు పంపించింది. ఆడవాళ్లను అవమానపరిచేలా ట్వీట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
నోటీసులో ఏముందంటే..
"మీరు చేసిన ట్వీట్ మహిళలను అవమానపరిచేలా ఉంది. బాలికను మీ ట్వీట్లో పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఓ మహిళ వ్యక్తిగత జీవితంతో పోల్చారు. ఇది తీవ్ర నేరపూరితం. మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వండి" - నోటీసులో జాతీయ మహిళా కమిషన్