ETV Bharat / sitara

Falaknuma Das: సీక్వెల్​కు రంగం సిద్ధం - ఫలక్​నుమా దాస్​ హీరో

యువ కథానాయకుడు విశ్వక్​సేన్​(Vishwak Sen) నటిస్తూ.. స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఫలక్​నుమా దాస్​'(Falaknuma Das). ఈ చిత్రంతో విశ్వక్​సేన్​కు మరింత గుర్తింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాకు సీక్వెల్​ రూపొందించనున్నట్లు విశ్వక్​సేన్​ స్పష్టం చేశారు.

Vishwak Sen announces Falaknuma Das sequel
Falaknuma Das: సీక్వెల్​కు రంగం సిద్ధం
author img

By

Published : Jun 8, 2021, 7:03 AM IST

Updated : Jun 8, 2021, 7:16 AM IST

మలయాళంలో విజయవంతమైన 'అంగమలై డైరీస్‌'(Angamaly Diaries) చిత్రాన్ని తెలుగులో 'ఫలక్‌నుమా దాస్‌'(Falaknuma Das) పేరుతో రీమేక్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందారు కథా నాయకుడు విశ్వక్‌ సేన్‌(Vishwak Sen). ఆయన ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పుడాయన ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ఫలక్‌నుమా దాస్‌ 2' తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. 'ఫలక్‌నుమా దాస్‌'(Falaknuma Das Sequel) ముహూర్తపు కార్యక్రమానికి సంబంధించిన ఓ పాత ఫొటోను విశ్వక్​ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

"మూడేళ్ల కిత్రం 'ఫలక్‌నుమా దాస్‌' ముహూర్తం షాట్‌. నిన్ననే జరిగినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రబృందం 'ఫలక్‌నుమా దాస్‌ 2' కోసం త్వరలోనే తిరిగి కలవబోతుంది."

- విశ్వక్​సేన్​, యువ కథానాయకుడు

నిజానికి మలయాళంలో 'అంగమలై డైరీస్‌'కు సీక్వెల్‌ రాలేదు. కానీ, ఇప్పుడాయన తన సొంత కథతోనే ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం విశ్వక్​ నటించిన 'పాగల్‌'(Paagal) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదీ చూడండి: "పాగల్​' చూడాలంటే టీవీలు, ఫోన్లు సరిపోవు!'

Last Updated : Jun 8, 2021, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.