మునగడమే ఎరుగదు అనే పేరున్న ఓడలో.. సామాజిక స్థాయి పరంగా భిన్న ధృవాలు అనదగ్గ యువతీ యువకుల మధ్య ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన దృశ్య కావ్యం టైటానిక్. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఇదీ ఒకటని చెప్పవచ్చు. చారిత్రక, రొమాంటిక్ అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం 11 ఆస్కార్ అవార్డులను గెల్చుకుంది. బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డుల కెక్కింది. 1997లో విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా దాని ముగింపు ఇప్పటికీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంది. కథలో భాగంగా 'హార్ట్ ఆఫ్ ద ఓషన్' అనే అమూల్యమైన వజ్రంతో కూడిన హారాన్ని.. ఆమె ఏకాంతంగా ఉన్నప్పుడు సముద్రంలోకి విసిరివేస్తుంది. కాగా, టైటానిక్‌కు సంబంధించిన మరో క్లైమాక్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది. దీనిలో హీరోయిన్ రోజ్ వయసు మళ్లినప్పటి పాత్రను పోషించిన వృద్ధురాలు గ్లోరియా స్టీవర్ట్.
దీనిలో ఆ హారం చివరి వరకు ఆమె వద్దే ఉన్నట్టు.. అనంతరం ముదిమి వయసులో, అందరి సమక్షంలో ఆమె దానిని సముద్రంలోకి విసిరేసినట్టు కనిపిస్తుంది. ఐతే దీనిపై విభిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండో క్లైమాక్స్‌నే చిత్రంలో ఉంచితే మరిన్ని ఆస్కార్లు లభించి ఉండేవని కొందరు అంటుండగా.. ఈ ముగింపు ఏమీ బాగాలేదని, దీని వల్ల సినిమా విలువ తగ్గిపోయి ఉండేదని మరికొందరు వాదిస్తున్నారు. దానిని విసిరేప్పుడు గ్లోరియా బామ్మ హావభావాలు మాత్రం చూసితీరాల్సిందేనని పలువురు అంటున్నారు. ఈ చర్యకు అక్కడున్న వారి భావోద్వేగాలనూ ఈ వీడియోలో మనం చూడవచ్చు. మరి టైటానిక్‌కు మరో ముగింపు ఎలా ఉందో మీరే చూడండి..
-
The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e
— Pat Brennan (@patbrennan88) February 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e
— Pat Brennan (@patbrennan88) February 16, 2021The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e
— Pat Brennan (@patbrennan88) February 16, 2021
ఇదీ చూడండి: అవార్డులన్నీ అందుకున్న అరుదైన కళాకారిణి కేట్!