లేడీ సూపర్ స్టార్.. రాములమ్మగా అందరి మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, నాయకురాలు విజయశాంతి పుట్టినరోజు నేడు. 'కర్తవ్యం' సినిమాలో నటనకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. 'లేడీ అమితాబ్ బచ్చన్'గా పేరు తెచ్చుకున్న విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
తెలుగు చిత్రసీమలోనే కాకుండా దక్షిణాది మొత్తంలో విజయశాంతి పేరు తెలియని వారుండరు. తెరపై విజయశాంతి కనిపిస్తే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేగేది. విజయశాంతి యాక్షన్ సన్నివేశాలు అభిమానులను మళ్లీ మళ్లీ సినిమా హాళ్లకు రప్పించేవి. ఇలా అందం, అభినయం కలగలిసిన విజయశాంతి దాదాపు 180 చిత్రాల్లో హీరోయిన్గా మురిపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలు అందరితోనూ నటించి అలరించిన అందాల తార విజయశాంతి.
ఆమె నటించిన 'ఒసేయ్ రాములమ్మ' వంటి చిత్రాలు టాప్ హీరోస్ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపించాయి. 'స్వయంకృషి'లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పుట్టింది ఇక్కడే...
విజయశాంతి 1966, జూన్ 24న వరంగల్‌లో జన్మించారు. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో నటించారు.
![vijaya shanthi birthday speical story from 'ramulamma' to 'sarileru neekevvaru'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7742255_dsdqw.jpg)
అవార్డులు..
- 'కర్తవ్యం' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు విజయశాంతి.
- 7 సార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలు గెలుచుకున్నారు.
- ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
- 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు.
- నాలుగుసార్లు నంది పురస్కారాలను అందుకున్నారు.
విశేషాలు...
1990లలో కథానాయకులతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమా రెమ్యూనరేషన్ కోటి రూపాయలు. ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ అదే. ఆమె 1998లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.
![vijaya shanthi birthday speical story from 'ramulamma' to 'sarileru neekevvaru'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7742255_hd.jpg)
సెకండ్ ఇన్నింగ్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె మొఖానికి రంగు వేసుకొని.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్'