వైవిధ్యభరిత చిత్రాలు, పాత్రలతో దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అతడు నటించిన 'సైరా'... త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా మెగాహీరో వైష్ణవ్‌తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన'లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్.. తొలి చిత్రం 'ఉప్పెన'. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో నటిస్తోన్న విజయ్ సేతుపతికి దాదాపు రూ.5 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నారట. ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు తొలుత సంకోచించినప్పటికీ విజయ్ వల్ల అటు తమిళంతో పాటు తెలుగులో మంచి హైప్ వస్తుందని ఓకే చెప్పారని సమాచారం.
ఇందులో హీరోయిన్ తండ్రిగా కనిపించనున్నాడు విజయ్. ఈ చిత్రంతో సుకుమార్ సహాయకుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఇది చదవండి: బేస్‌బాల్ ప్లేయర్‌తో హీరో సోదరి ప్రేమాయణం