కోలీవుడ్ స్టార్ విజయ్.. తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పడు పలకరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ 'మాస్టర్'గా వచ్చి మెప్పించారు. ఇప్పుడు నేరుగా ఓ తెలుగు దర్శకుడితో పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
'ఊపిరి', 'మహర్షి' తదితర చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇటీవల చెన్నై వెళ్లి విజయ్‌కు ఓ కథ వినిపించారట. అయితే ఆ కథ నచ్చి, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని అన్నారట. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఖరారైతే తొలిసారి తెలుగు డైరెక్టర్‌తో విజయ్ పనిచేయబోయే చిత్రమిదే అవుతుంది. దీనికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.
విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కరోనా కారణంగా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.