కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లలోకి రావాల్సిన ఎన్నో సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విజయ్ దేవరకొండ 'లైగర్' కూడా చేరేలా కనిపిస్తోంది. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని తెలుస్తోంది.
పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్.. బాలీవుడ్లోనూ అడుగుపెడుతున్నారు. ముంబయిలో ఎక్కువ శాతం షూటింగ్ జరుగుతోంది. అయితే కేసులు ఎక్కువగా వస్తున్న దృష్ట్యా, మహారాష్ట్రలో చిత్రీకరణలపై స్టే విధించారు. దీంతో అక్కడ జరగాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక దానిని తిరిగి మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఇవన్నీ జరిగితే సెప్టెంబరు 9న థియేటర్లలోకి సినిమా రావడం కష్టమవుతుంది. ఇందులో భాగంగా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశముంది.
అయితే 'లైగర్' చిత్రాన్ని ఓటీటీలో నేరుగా రిలీజ్ ఆలోచన ఏం లేదని నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకుడు.
ఇది చదవండి: 'ఆదిపురుష్' షూటింగ్ ఇకపై హైదరాబాద్లో!