ఇటీవలే జరిగిన ఓ అవార్డు వేడుకల్లో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతోపాటు కన్నడ హీరో యశ్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'యశ్ నుంచి ఓ వస్తువును దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు?' అని విజయ్‌ను వేదికపై అడిగారు. దానికి ఆయన ఏ మాత్రం తడుముకోకుండా 'ప్రశాంత్ నీల్' అని సమాధానం ఇచ్చాడు. అనంతరం విజయ్ నవ్వుతూ.. ‘ఆయన్ను దొంగిలిస్తే రహస్యంగా 'కేజీఎఫ్ 3' సినిమా తీయవచ్చని జోక్ చేశాడు.
'కేజీఎఫ్-1'తో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సినీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్-2'ను తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. మరోపక్క పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్న 'ఫైటర్' సినిమాలోనూ విజయ్ నటించబోతున్నాడు. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మాణంలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు ఇటీవలే విజయ్-దిల్‌రాజు-శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించారు.
ఇదీ చదవండి:- 2019లో టాలీవుడ్ మధుర స్మృతులు..