పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి 'ఫైటర్' టైటిల్‌ను పరిశీలిస్తుంది చిత్రబృందం. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రాజెక్టులో భాగమయ్యాడు. తాజాగా ఈ ముగ్గురు నిర్మాతలు కలిసున్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయనుంది చిత్ర బృందం. అందు కోసం ముగ్గురు నిర్మాతలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్.. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. 'జై లవకుశ' ఫేమ్ రోనిత్ రాయ్ విలన్‌గా కనిపించనున్నాడు. హీరోయిన్గా అనన్య పాండే నటించబోతుంది.
ఇదీ చూడండి.. రౌడీహీరో బాలీవుడ్ ఎంట్రీ.. 'ఫైటర్' షూటింగ్ ప్రారంభం