ఇప్పటికే 'రౌడీ' పేరుతో వస్త్ర వ్యాపార రంగంలో(Rowdy Fashion) రాణిస్తున్న విజయ్ దేవరకొండ.. తాజాగా మల్టీప్లెక్స్(AVD Cinemas) బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అవును.. ఆయన సొంతూరు మహబూబ్‌నగర్‌లో ఏషియన్ విజయ్ దేవరకొండ(AVD Cinemas)పేరుతో నిర్మించిన మల్టీప్లెక్స్ సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది.
'అర్జున్‌రెడ్డి'తో యువతలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుని నటుడిగానే కాకుండా బిజినెస్‌మేన్‌గానూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు నటుడు విజయ్ దేవరకొండ. 'రౌడీ'పేరుతో వస్త్ర వ్యాపార రంగంలో రాణిస్తున్న విజయ్ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు.
ఆ సినిమాతో ప్రారంభం..
ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో బిగ్‌స్క్రీన్ నిర్మించారు. నగరంలోని తిరుమల థియేటర్ స్థానంలో ఏషియన్ విజయ్‌దేవరకొండ సినిమాస్(AVD Cinemas) మల్టీప్లెక్స్ సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ఈ థియేటర్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు.
ఏవీడీ..
నటుడు కావాలని కలలు కన్న రోజులు.. దాని కోసం కష్టపడిన రోజులు.. గుర్తు చేసుకుంటుంటే అవన్నీ నిన్నే జరిగాయి అన్నట్టు ఉంది. నటుడిగా మిమ్మల్ని అలరించిన నేను ఇప్పుడు మీకు మరింత వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ ప్రారంభించాను. నా తల్లిదండ్రుల సొంతూరైన మహబూబ్‌నగర్‌లో నా మొట్టమొదటి మల్టీప్లెక్స్ (ఏవీడీ-ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్)(AVD Cinemas) ఇది. సాయిపల్లవి, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'లవ్‌స్టోరీ'(Love Story Release Date) సినిమాతో 'ఏవీడీ'ప్రారంభం కానుంది. నా కెరీర్ శేఖర్‌గారి వద్ద మొదలైంది. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాతోనే ఏవీడీ ప్రారంభం కావటం ఆనందంగా ఉంది.
ఏవీడీ ప్రారంభ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌లో ఉండాలనుకున్నాను. కానీ గోవాలో 'లైగర్' కోసం బిజీగా ఉండటం వల్ల అక్కడికి రాలేకపోతున్నా. ఇది నా జీవితంలో చాలా గొప్ప విషయం అని విజయ్ దేవరకొండ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: This Week Movie Releases: ఈ వారం విడుదలయ్యే చిత్రాలివే!