కరోనా కారణంగా చిత్రీకరణలన్నీ నిలిచిపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు సినీతారలు. 'బీ ద రియల్‌మ్యాన్' ఛాలెంజ్‌తో తమ ఇంట్లోని మహిళలకు పనుల్లో సాయం చేసి ఆ వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ నామినేట్ చేయగా.. ఛాలెంజ్‌ను స్వీకరించిన విజయ్ దేవరకొండ.. తనని ఇంట్లో పనులు చేయనివ్వడం లేదని, కాకపోతే లాక్‌డౌన్‌లో తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఓ వీడియోను తప్పకుండా పోస్ట్ చేస్తానని ఇటీవలే చెప్పాడు.
తాజాగా లాక్‌డౌన్‌లో తన దినచర్యకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. "లాక్‌డౌన్‌లో నా రోజూవారి జీవితానికి సంబంధించిన ఓ చిన్ని వీడియో. ఆనంద్ దేవరకొండ ఈ వీడియోను రూపొందించాడు. శివ కొరటాల నన్ను ఈ ఛాలెంజ్ స్వీకరించమన్నారు. నేను ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌ను నామినేట్ చేస్తున్నా" అని విజయ్ తెలిపాడు.
-
Bits of my day in lockdown :)
— Vijay Deverakonda (@TheDeverakonda) April 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Documented by @ananddeverkonda#BeARealMan challenged by @sivakoratala sir. I would like to extend it to Kunjikkaa @dulQuer pic.twitter.com/8bLAAQYeMo
">Bits of my day in lockdown :)
— Vijay Deverakonda (@TheDeverakonda) April 25, 2020
Documented by @ananddeverkonda#BeARealMan challenged by @sivakoratala sir. I would like to extend it to Kunjikkaa @dulQuer pic.twitter.com/8bLAAQYeMoBits of my day in lockdown :)
— Vijay Deverakonda (@TheDeverakonda) April 25, 2020
Documented by @ananddeverkonda#BeARealMan challenged by @sivakoratala sir. I would like to extend it to Kunjikkaa @dulQuer pic.twitter.com/8bLAAQYeMo
అయితే విజయ్ పోస్ట్ చేసిన వీడియోలో తన ఇంటిని చాలా వరకూ చూపించారు. ఎప్పుడూ 6 గంటలు నిద్రపోయే విజయ్ లాక్‌డౌన్ వల్ల 9.30 గంటలు నిద్రపోతున్నట్లు తెలిపాడు.
ఇదీ చూడండి.. వైద్యులపై దాడులను మానుకోవాలి:రవీనా