ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో 'వి' దర్శకుడు.. సినిమా పక్కా - విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్

టాలీవుడ్​లో విభిన్న చిత్రాల డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి.. విజయ్​ దేవరకొండతో సినిమా చేయడం కచ్చితమని చెప్పారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఆ చిత్రం మొదలవుతుందని అన్నారు.

vijay-devarakonda-movie-with-director-mohana-krishna-indraganti
మరో సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్
author img

By

Published : Jan 20, 2021, 3:56 PM IST

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో తన సినిమా తప్పకుండా ఉంటుందని దర్శకుడు మోహన్​కృష్ణ ఇంద్రగంటి చెప్పారు. పూరీ జగన్నాథ్, శివ నిర్వాణ చిత్రాలు పూర్తయిన తర్వాత తమ కాంబోలో ప్రాజెక్టు మొదలవుతుందని ఇంద్రగంటి ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

ఈటీవీ భారత్​తో దర్శకుడు మోహన్​కృష్ణ ఇంద్రగంటి

విజయ్ 'లైగర్' టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పిన ఇంద్రగంటి... విభిన్న టైటిల్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం పూరీ స్టైల్ అని కితాబిచ్చారు. మూడోసారి సుధీర్​బాబుతో రొమాంటిక్ డ్రామా చేస్తున్నానని చెప్పారు. మార్చి నుంచి షూటింగ్ మొదలవుతుందని అన్నారు.

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ జరుగుతుందని మోహన్​కృష్ణ వెల్లడించారు. 2020లో 'వి' సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ రచయితగా, దర్శకుడిగా తనకెంతో సంతృప్తి కలిగిందని అన్నారు.

ఇది చదవండి: బాక్సింగ్ కథ పట్టు.. హిట్టు కొట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.