తెలుగు చిత్ర పరిశ్రమలో 'కిల్ ఫేక్ న్యూస్' నినాదం ఊపందుకుంది. అసత్య వార్తలు రాస్తున్న వెబ్‌సైట్ల భరతం పట్టాల్సిందే అంటూ సినీ తారలు, దర్శకనిర్మాతలు ఒక తాటిపైకి వస్తున్నారు. అందుకోసం కార్యాచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ గళం విప్పడంతో ఈ ఉద్యమం మొదలైంది. కరోనా విపత్తుతో సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ ఇటీవల తన 'ది దేవరకొండ ఫౌండేషన్' తరఫున మిడిల్‌క్లాస్ ఫండ్ పేరుతో సహాయనిధిని ఏర్పాటు చేశారు. దాని ద్వారా అవసరార్థులకు నిత్యావసరాల్ని అందిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్ని విమర్శిస్తూ ఓ వెబ్‌సైట్ ప్రచురించిన కథనాలు విజయ్ దేవరకొండకు ఆగ్రహం కలిగించాయి. 'కొన్ని వెబ్‌సైట్లు విపరీతంగా వదంతులు రాస్తున్నాయి. నా కెరీర్‌ను, పేరును నాశనం చేయాలని చూస్తున్నారు కొంతమంది. ఇలాంటి అసత్య వార్తల వల్ల చాలా మంది బాధపడుతున్నారు. చిత్ర పరిశ్రమ ఇంకా బాధపడుతోంది. అయినా ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చా. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది' అంటూ విజయ్ ఓ వీడియోను సామాజిక అనుసంధాన వేదికల ద్వారా పంచుకున్నారు. దీనిపై చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు తదితర అగ్ర కథానాయకులు స్పందించి విజయ్‌కి మద్దతుగా నిలిచారు.
"ఎన్నో ఏళ్ల తపన, శ్రమ, అంకితభావంతో ప్రజల్లో ఈ ప్రేమ, గౌరవాలు పొందుతాం.గుర్తింపు లేని కొందరు వ్యక్తులు డబ్బు వ్యామోహంతో మన గౌరవ మర్యాదలు పోగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వాటి నుంచి మన అందమైన చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని, మన పిల్లల్ని సురక్షితంగా ఉంచాలి. ఇలాంటి వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమకు పిలుపునిస్తున్నా"
-మహేశ్, మహేశ్.
-
I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020
"ప్రియమైన విజయ్.. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యత లేని రాతల వల్ల మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమంతా నీకు అండగా ఉన్నాం"
-చిరంజీవి, కథానాయకుడు.
-
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020
"చిరంజీవితో పాటు మిగిలిన చిత్రసీమ ప్రముఖులు విజయ్ దేవరకొండకు అండగా నిలిచినందుకు ప్రశంసిస్తున్నా. కానీ, ఇది మాత్రమే చాలదు. మనకొక యాక్షన్ ప్లాన్ అవసరం"
-నాగార్జున. కథానాయకుడు.
-
Dear @KChiruTweets Garu, really appreciate your support to a colleague @TheDeverakonda 🙏we all have been through this anguish!! @urstrulyMahesh, @RaviTeja_offl , @RanaDaggubati, @sivakoratala, @DirKrish @directorvamshi Stand by you is not enough,WE NEED AN ACTION PLAN!! https://t.co/gdxMtpy1iv
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @KChiruTweets Garu, really appreciate your support to a colleague @TheDeverakonda 🙏we all have been through this anguish!! @urstrulyMahesh, @RaviTeja_offl , @RanaDaggubati, @sivakoratala, @DirKrish @directorvamshi Stand by you is not enough,WE NEED AN ACTION PLAN!! https://t.co/gdxMtpy1iv
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 5, 2020Dear @KChiruTweets Garu, really appreciate your support to a colleague @TheDeverakonda 🙏we all have been through this anguish!! @urstrulyMahesh, @RaviTeja_offl , @RanaDaggubati, @sivakoratala, @DirKrish @directorvamshi Stand by you is not enough,WE NEED AN ACTION PLAN!! https://t.co/gdxMtpy1iv
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 5, 2020
"నేను నీ వెంటే ఉన్నా. చిత్ర పరిశ్రమ, అభిమానులు, సినీప్రియులు.. అందరం కలిసికట్టుగా ఈ తప్పుడు వార్తలు, పనికిరాని అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడదాం"
-రవితేజ, కథానాయకుడు.
-
This is the need of the hour! I stand by you @TheDeverakonda. Let’s all ( audiences, fans, film industry) stand united against fake news and useless Gossips. #KillFakeNews #KillGossipWebsites https://t.co/2NGIw4fXbf
— Ravi Teja (@RaviTeja_offl) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is the need of the hour! I stand by you @TheDeverakonda. Let’s all ( audiences, fans, film industry) stand united against fake news and useless Gossips. #KillFakeNews #KillGossipWebsites https://t.co/2NGIw4fXbf
— Ravi Teja (@RaviTeja_offl) May 4, 2020This is the need of the hour! I stand by you @TheDeverakonda. Let’s all ( audiences, fans, film industry) stand united against fake news and useless Gossips. #KillFakeNews #KillGossipWebsites https://t.co/2NGIw4fXbf
— Ravi Teja (@RaviTeja_offl) May 4, 2020
కథానాయకులు రానా, అల్లరి నరేశ్, అడవి శేష్, కార్తికేయ, రాజశేఖర్, దర్శకులు పూరి జగన్నాథ్, క్రిష్, కొరటాల శివ, సుకుమార్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, కథానాయికలు రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్‌లతో పాటు పలు నిర్మాణ సంస్థలు కూడా విజయ్‌కి మద్దతు తెలిపాయి. అసత్య వార్తలు రాసే వెబ్‌సైట్స్‌పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్మాతల మండలి ప్రకటించింది. "నిరాధారమైన వార్తల్ని, వదంతులను ప్రచారం చేసే సంస్థలపై మేం కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయించాం" అని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలిపింది.