ఇళయ దళపతి విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌కు ప్రేక్షకులల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్’ చిత్రాలే దానికి నిదర్శనం. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుందనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
విజయ్ కోసం మురుగదాస్ కథను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందనుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మురుగదాస్.. రజనీ కథానాయకుడుగా ‘దర్బార్’ చిత్రం దాదాపుగా పూర్తయింది. ఆ చిత్రం విడుదలయ్యాక విజయ్‌తో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇదీ చదవండి: మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా?