ETV Bharat / sitara

'విజయ్​ 65' ఫస్ట్​లుక్.. 'రాజ రాజ చోర' టీజర్​ - పృథ్వీరాజ్​ సుకుమారన్​ కోల్డ్​ కేస్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. దళపతి 'విజయ్​ 65' సినిమా ఫస్ట్​లుక్​, 'రాజ రాజ చోర' టీజర్​తో పాటు నాని ఫ్రంట్​లైన్​ వర్కర్ల కోసం రూపొందించిన 'దారే లేదా' సాంగ్​ ప్రొమో అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

Vijay 65 movie first look - Raja Raja Chora teaser
'విజయ్​ 65' ఫస్ట్​లుక్.. 'రాజ రాజ చోర' టీజర్​
author img

By

Published : Jun 17, 2021, 10:36 PM IST

సౌథాంప్టన్​ వేదికగా శుక్రవారం(జూన్​ 18) నుంచి ప్రారంభంకానున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final)లో టీమ్ఇండియా, న్యూజిలాండ్​(IND vs NZ) జట్లు తలపడనున్నాయి. ఈ ఐసీసీ ట్రోఫీని భారత జట్టు నెగ్గాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​ హీరో సాయిధరమ్​ తేజ్​ జెర్సీ ధరించి టీమ్ఇండియాకు తన మద్దతు తెలుపుతున్నాడు.

Vijay 65 movie first look - Raja Raja Chora teaser
టీమ్ఇండియా జెర్సీలో హీరో సాయితేజ్​

కరోనాపై నిరంతర పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం నేచురల్‌ స్టార్‌ నాని.. 'దారే లేదా'(Daare leda) అనే వీడియో సాంగ్‌ను రూపొందించారు. ఆ గీతాన్ని ఈ నెల 18న సాయంత్రం 4.32గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు. గురువారం ఆ పాట ప్రోమో​ను రిలీజ్​ చేశారు.

యువ కథానాయకుడు శ్రీవిష్ణు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'రాజ రాజ చోర'. ఈ చిత్ర టీజర్​ను శుక్రవారం(జూన్​ 18) ఉదయం 10.08 గంటలకు చిత్రబృందం విడుదల చేయనుంది.

'రాజ రాజ చోర' టీజర్​ పోస్టర్​

దళపతి విజయ్ ప్రధానపాత్రలో సన్​పిక్చర్స్​ బ్యానర్​పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకుడిగా పనిచేస్తున్నారు. అనిరుధ్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విజయ్​ ఫస్ట్​లుక్​ను జూన్​ 21న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'విజయ్​ 65' ఫస్ట్​లుక్ పోస్టర్​

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ సతీమణి స్నేహారెడ్డి.. తరచుగా ఫొటోలు షేర్​ చేస్తూ ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్​స్టా ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య​ 4 మిలియన్ల మైలురాయిని చేరుకుంది.

అల్లు స్నేహారెడ్డి ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్​

మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్​ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'కోల్డ్​ కేస్'​(Cold Case). తనూ బాలక్​ దర్శకత్వంలో రూపొందనుంది. జూన్​ 30న ఈ చిత్రాన్ని అమెజాన్​ ప్రైమ్​ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'కోల్డ్​ కేస్​' సినిమా రిలీజ్​ పోస్టర్​

ఇదీ చూడండి.. నాని 'సర్​ప్రైజ్​ సాంగ్' రిలీజ్​ ఎప్పుడంటే?​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.