గణితశాస్త్ర మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు శకుంతలా దేవి. 1980లో లండన్ వేదికగా ప్రపంచరికార్డు నెలకొల్పారు. తాజాగా ఆమె బయోపిక్‌లో నటిస్తున్న విద్యాబాలన్ లండన్ ఇంపిరీయల్ కళాశాలను సందర్శించింది. ఆ కాలేజీలో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది విద్యా.
"శకుంతలా దేవి జీవితం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చాలా ముడిపడి ఉంది. ఇదే కళాశాలలో ఉన్నప్పుడే ఆమె గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజీని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నా" -విద్యాబాలన్, బాలీవుడ్ నటి.
1980 జూన్ 18న 2 నంబర్ల 13 అంకెల హెచ్చివేతను కేవలం 28 సెకండ్లలో గుణించి సమస్యను పరిష్కరించారు శకుంతలా దేవీ. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కంప్యూటర్ విభాగం నిర్వహించిన ఈ పోటీలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. శకుంతలా దేవికి ఐదేళ్లు ఉన్నప్పుడే 18 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు చేసే గణిత సమస్యను పరిష్కరించారు.
శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అనుమీనన్ దర్శకత్వం వహిస్తోంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇదీ చదవండి: దుర్గామాతకు బాలీవుడ్ తారల ప్రత్యేక పూజలు