ETV Bharat / sitara

'బయోపిక్​లో నటించాలంటే ఇవి నేర్చుకోండి'

author img

By

Published : Jul 24, 2020, 2:56 PM IST

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విద్యాబాలన్. తాజాగా ఆమె హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి బయోపిక్​లో నటించారు. ఈనెల 31న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా బయోపిక్​లో నటించాలంటే ఆ వ్యక్తిని అనుకరించకూడదని తెలిపారు.

'బయోపిక్​లో నటించాలంటే అవి ఇవి నేర్చుకోండి'

విభిన్న కథలు ఎంచుకుంటూ.. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్నారు విద్యా బాలన్‌. తాజాగా ఆమె హ్యూమన్‌ కంప్యూటర్‌ శకుంతలా దేవి బయోపిక్‌లో నటించారు. ఈనెల 31న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అంతకుముందు విద్యా బాలన్‌ 'ది డర్టీ పిక్చర్‌'(సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా) 'నో వన్‌ కిల్ల్‌డ్‌ జెస్సికా'(సబ్రినా లాల్‌ కేసు ఆధారంగా), 'మిషన్‌ మంగళ్‌'(తారా షిండే పాత్ర) వంటి బయోపిక్స్‌లో నటించి.. వాటిల్లో ఎక్స్‌పర్ట్‌గా మారిపోయారు. అయితే బయోపిక్స్‌లో నటించాలంటే వ్యక్తిని అనుకరించడం కాదు.. అర్థం చేసుకోవాలని అంటున్నారు.

"బయోపిక్‌లో నటిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బయోపిక్‌ చేస్తున్నాం కదా అని ఆ వ్యక్తిలా కనిపించడం కోసం హావభావాలను.. స్వరాన్ని అనుకరించకూడదు. మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదే. 'ది డర్టీ పిక్చర్' తీస్తున్నప్పుడు నేను సిల్క్‌ స్మితలా కనిపించట్లేదని ఆ చిత్ర దర్శకుడు మిలాన్‌ లుత్రియానే చెప్పారు. అలాగే శకుంతలా దేవిలా నేను కనిపించను. కాబట్టి వ్యక్తుల జీవిత సారాంశాన్ని మాత్రమే గ్రహించి నటించాల"’అని విద్యా బాలన్‌ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.