ETV Bharat / sitara

వెంకీమామ మద్దతుతో 'మోసగాళ్లు' ట్రెండింగ్ - మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'మోసగాళ్లు'. ఈ సినిమాకు స్టార్ హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

Victory Venkatesh lend  his voice for Vishnu Mosagallu movie
'మోసగాళ్ల'కు మద్దతిస్తోన్న వెంకటేశ్
author img

By

Published : Oct 16, 2020, 1:15 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఇప్పటికే టైటిల్ పోస్టర్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమా టీజర్​ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయగా.. మరోసారి ఈ సినిమాకు స్టార్ హీరో మద్దతు లభించింది. తాజాగా విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో ఈ విషయం ట్విట్టర్​లో ట్రెండింగ్​గా మారింది.

చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విష్ణుకు జోడీగా బాలీవుడ్ భామ రుహీ సింగ్ నటిస్తోంది. కాజల్ అగర్వాల్ అతడికి సోదరిగా కనిపించనుంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.