స్వాతంత్య్ర ఉద్యమకారుడు ఉధమ్‌సింగ్ బయోపిక్‌లో నటిస్తున్నాడు హీరో విక్కీకౌశల్. తాజాగా ఆ సినిమాలోని తొలిరూపు విడుదల చేశారు తరణ్‌ఆదర్శ్. హాలీవుడ్ హీరో లుక్‌లో కనువిందు చేస్తున్నాడు విక్కీ.
![vicky kaushal in sardar udhamsingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3145563_vicky2.jpg)
ఈ చిత్రాన్నిఅక్టోబర్, పికు చిత్రాల దర్శకుడు షూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్నాడు. రితేశ్ షా, షుబెందు భట్టాచార్య కథ అందించారు. రోన్నీ లహరి,షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా... 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎవరీ ఉధమ్‌సింగ్:
గదర్ పార్టీకి చెందిన ఉధమ్ సింగ్ 1899 డిసెంబరు 26న జన్మించారు. ఆయన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యపాత్ర వహించారు. 1919లో అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ మరణఖాండకు కారణమైన... పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయర్ను అంతమొందించడంలో ప్రధాన పాత్రదారుడు. ఫలితంగా 1940 జులై 31న ఉధమ్సింగ్ను ఉరితీశారు.
![vicky kaushal in sardar udhamsingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3145563_udamsingh.jpg)
ఇటీవల 'గుజరాత్' అనే హరర్ మూవీలో నటిస్తూ... విక్కీ కౌశల్ గాయపడ్డాడు. ఆయన దవడకు 13 కుట్లు పడినట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం విక్కీ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
గతేడాది విక్కీ ప్రధానపాత్రలో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన ఉరి చిత్రం ఘనవిజయం సాధించింది.