ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2' షూట్​లో ప్రకాశ్​రాజ్.. ఎలివేషన్స్ షురూ - ప్రకాశ్​ రాజ్​ కొత్త సినిమా

కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్ ట్వీట్ చేశారు.​ ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్​తో క్లైమాక్స్ ఫైట్ మినహా చిత్రీకరణ పూర్తయినట్లే.

kgf
ప్రకాశ్​ రాజ్​
author img

By

Published : Aug 26, 2020, 1:45 PM IST

Updated : Aug 26, 2020, 2:41 PM IST

కన్నడ హీరో య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'కేజీఎఫ్'.. గతేడాది విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీక్వెల్ కోసం ఎంతో ఎదురుచూసేలా చేసింది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చివరి షెడ్యూల్​ షూటింగ్, బెంగళూరులో జరుగుతోంది. ఇది 10 రోజుల పాటు ఉండనుంది.

లాక్​డౌన్​తో వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం నుంచి చిత్రీకరణ​ ప్రారంభమైంది. విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ చిత్రీకరణలో పాల్గొన్నట్లు ట్వీట్ చేశారు. 'స్టార్ట్..​ కెమెరా.. యాక్షన్​ బ్యాక్​టూ వర్క్'​ అంటూ ఫొటోలను పోస్ట్ చేశారు. 'కేజీఎఫ్​' తొలి భాగంలో అనంత్ నాగ్​ కనిపించిన పాత్రలో.. రెండో భాగంలో ప్రకాశ్​ రాజ్​ కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'చాప్టర్ 2'లోనూ అనంత్​ నాగ్​ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.

kgf
ప్రకాశ్​ రాజ్​

ఇందులో యష్​ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటించింది. సంజయ్ దత్ అధీరాగా, రవీనా టండన్ ప్రధానమంత్రిగా కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Last Updated : Aug 26, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.