అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన అగ్రనటుడు వెంకటేశ్ కలియుగ పాండవులు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు వెంకటేశ్. వెంకటేష్ మొదటి సినిమా కావడం వల్ల దర్శకుడు రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ముఖ్యంగా హీరో పాత్రను కాస్త వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. తొలి సన్నివేశాల్లో నెగెటివ్ షేడ్స్ ఉండేలా చూపించి, ఆ తర్వాత మారిన కథానాయకుడిని చూపించాడు.
ఈ చిత్రం క్లైమాక్స్‌లో హీరోని అతని స్నేహితుల బృందాన్ని బంధించి రాబందులతో పొడిపించే సన్నివేశం ఉంది. అందుకోసం ఫైట్‌మాస్టర్ విజయన్ నిజమైన రాబందులను తీసుకొచ్చాడు. అందులో ఒకటి వెంకటేశ్ మెడపై పొడుస్తున్నట్లు కనిపించడానికి వెనకవైపు చెక్క ముక్క పెట్టి ,దానికి మాంసం గుచ్చారట. రాబందు మాంసాన్ని పొడిచి తింటుంటే, అవి తననెక్కడ పొడుస్తాయోనని వెంకటేష్ కాస్త భయపడ్డారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అంతేకాదు.. హీరో పరిచయ సన్నివేశంలో ఓ ప్రత్యేకత ఉంది. వెంకటేశ్ తన స్నేహితులతో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతాడు. తన స్నేహితుల కన్నా పైమెట్టుపై ఉండగా అప్పుడు వెనక్కి తిరిగి మెడలో శాల్ వేసుకుని ‘వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత. విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత’ అంటూ డైలాగ్ చెబుతూ కనిపిస్తాడు. అలా తొలి చిత్రంలో పలికిన ‘విక్టరీ’ పదం చివరకు వెంకటేష్ విజయాలకు చిరునామాగా నిలిచింది.
ఇదీ చూడండి: సాయిపల్లవితో కమ్ముల మరోసారి ఫిదా చేస్తాడా?