టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' విడుదల ఖరారైంది. జులై 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అభిమానులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం.. రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోమవారం పోస్ట్ చేసింది.
తమిళ సూపర్‌హిట్ 'అసురన్' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
తొలుత థియేటర్లలోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో చిత్రబృందం ఓటీటీ రిలీజ్‌నే ఎంచుకుంది. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మించారు.